Brs Vs Congress : కొత్త టర్న్ తీసుకున్న రుణమాఫీ రగడ.. సై అంటే సై..

దొంగ రాజీనామా లేఖతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. హరీశ్‌ డ్రామాలను ప్రజలు పట్టించుకోరన్నారు.

Brs Vs Congress : రుణమాఫీ మే సవాల్ రాజీనామా సవాల్ గా మారింది. పంద్రాగస్టు డెడ్ లైన్ తెలంగాణ పాలిటిక్స్ లో హెడ్ లైన్ అయిపోయింది. రుణమాఫీ సెంట్రిక్ గా రేవంత్, హరీశ్ రావు మధ్య జరిగిన డైలాగ్ వార్ కేరాఫ్ గన్ పార్క్ అయిపోయింది. సీన్ ఇప్పుడు హరీశ్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయింది. హస్తం పార్టీ లీడర్లంతా హరీశ్ రావే టార్గెట్ గా అటాక్ చేస్తున్నారు.

రుణమాఫీ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి పంద్రాగస్ట్‌ డెడ్‌లైన్‌ను హెడ్‌లైన్‌గా వాడుకుంటూ విమర్శల దాడి చేస్తూ వచ్చారు మాజీమంత్రి హరీశ్‌రావు. సవాళ్లపర్వం రాజీనామాల దాక వెళ్లడంతో అన్నమాట ప్రకారం ఉదయం రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లారు హరీశ్‌రావు. దేవుళ్లను కూడా వదలకుండా రేవంత్‌ ఓట్ల రాజకీయం చేస్తున్నారని.. ఆయన హామీ నిజమే అయితే రాజీనామా సవాల్‌ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని ప్రశ్నించారు. హరీశ్‌ రాజీనామా లేఖపై సోషల్ మీడియా టీమ్‌ సమావేశంలో సెటైరికల్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. దీంతో మరోసారి ఇద్దరి మధ్య డైలాగులు పేలాయి.

గన్‌పార్క్‌ అమరువీరుల స్థూపం వద్ద టెన్షన్ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యాయి. బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీశ్‌రావు అక్కడికి చేరుకునేలోపే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. ఐదుగురు నేతలను మాత్రమే అమరవీరుల స్థూపం దగ్గరకు అనుమతించారు.

హరీశ్‌రావు రాకతో గన్‌పార్క్ మలీనమైందంటూ.. అమరవీరుల స్థూపాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు. హరీశ్‌రావు రాజీనామాను వృథా కానివ్వమని.. రుణమాఫీ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.

హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. దొంగ రాజీనామా లేఖతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. హరీశ్‌ డ్రామాలను ప్రజలు పట్టించుకోరన్నారు. దమ్ముంటే మెదక్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలంటూ సవాల్ చేశారు కోమటిరెడ్డి.

రుణమాఫీమే సవాల్‌ నిన్న మొన్నటివరకు రేవంత్‌ వర్సెస్ హరీశ్‌ అన్నట్లుగా కొనసాగింది. అమరవీరుల స్థూపం దగ్గరకు రాజీనామా లేఖతో వెళ్లి హరీశ్‌ రావు మరోసారి సవాల్‌ చేయడంతో కాంగ్రెస్‌ నేతలంతా వరుసగా పెట్టి అటాక్ స్టార్ట్ చేశారు.

Also Read : నేను గెలిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షలు వస్తాయన్నారు మోదీ.. మరి వచ్చాయా?- కేసీఆర్ ఫైర్

ట్రెండింగ్ వార్తలు