Sunny Leone: సన్నీ ఫ్యాన్స్‌కు చికెన్ షాప్ ఓనర్ బంపరాఫర్

అందాల తార సన్నీ లియోన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె సినిమా వస్తుందంటే ఇండియన్ ఆడియెన్స్....

Sunny Leone: అందాల తార సన్నీ లియోన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె సినిమా వస్తుందంటే ఇండియన్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆమె చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కాగా టాలీవుడ్‌లో యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న కొత్త సినిమాలో సన్నీ లియన్ నటిస్తుండటంతో ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక సన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఎలాంటి న్యూస్‌నైనా క్షణాల్లో వైరల్ చేస్తుంటారు.

Sunny Leone : పెళ్లి టైంలో చేతిలో డబ్బులు లేవు.. గెస్టులు ఇచ్చిన గిఫ్టులతో రిసెప్షన్ బిల్లులు కట్టాం..

అయితే సన్నీకి వీరాభిమాని అయిన ఓ కర్ణాటకవాసి తన అభిమానాన్ని అందరికీ భిన్నంగా చూపిస్తున్నాడు. తన చికెన్ షాప్‌కు వచ్చే సన్నీ లియోన్ అభిమానులకు అదిరిపోయే బంపరాఫర్ ప్రకటించాడు సదరు అభిమాని. కర్ణాటకలోని మాండ్యా నగరంలో ప్రసాద్ అనే చికెన్ షాప్ ఓనర్ సన్నీ లియోన్‌కు వీరాభిమాని. ఆమెపై తన అభిమానాన్ని చాటుకునేందుకు తన దుకాణంలో చికెన్ కొనుగోలు చేసే సన్నీ లియోన్ ఫ్యాన్స్‌కు 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సన్నీ ఫ్యాన్స్ అతడి చికెన్ షాప్‌కు ఎగబడుతున్నారు.

దీంతో ప్రసాద్ తన వద్ద డిస్కౌంట్ పొందాలంటే కొన్ని కండీషన్లను పాటించాల్సిందే అంటున్నాడు. సన్నీ లియోన్ అభిమానులు ముందుగా సోషల్ మీడియాలో సన్నీకి సంబంధించిన అన్ని అకౌంట్స్‌ను తప్పకుండా ఫాలో కావాల్సి ఉంటుంది. వారి ఫోన్లలో సన్నీ లియోన్‌వి కనీసం 5 ఫోటోలైనా ఉండాల్సిందే. సన్నీ లియోన్ సినిమాలు, ఫోటోలకు లైక్స్ చేసి, కామెంట్స్ చేయాల్సి ఉండాలి.. అంటూ మూడు కండీషన్లు పెట్టాడు.

Sunny Leone: సన్నీ దెబ్బకు పరుగులు పెట్టిన మంచు విష్ణు.. మీమర్స్‌కు కొత్త స్టఫ్!

ఈ మూడు షరతులను ఫాలో అయిన సన్నీ లియోన్ ఫ్యాన్స్‌కు తన చికెన్ షాప్‌లో ఏడాదిపాటు 10 శాతం డిస్కౌంట్ ధరకు చికెన్ విక్రయిస్తానంటూ పేర్కొన్నాడు. దీంతో సన్నీ లియోన్ ఫ్యాన్స్ సంవత్సరం పాటు ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇలా సన్నీ లియోన్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చూపించిన ప్రసాద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

ట్రెండింగ్ వార్తలు