minister komatireddy venkat reddy review on vijayawada highway
Vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇవాళ రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన సేఫ్టీ మెజర్స్ పై సమీక్ష నిర్వహించారు.
బ్లాక్ స్పాట్స్ గుర్తించిన ప్రాంతాలు
1. చౌటుప్పల్
2. పెదకాపర్లి
3. చిట్యాల
4. కట్టంగూర్
5. ఇనుపాముల
6. టెక్మట్ల
7. ఎస్వీ కాలేజ్ జనగాం ఎక్స్ రోడ్
8. ఈనాడు జంక్షన్
9. దురాజ్ పల్లి జంక్షన్
10. ముకుందాపూరం
11. అకుపాముల
12. కోమరబండా ఎక్స్ రోడ్డ్
13. కాటకమ్మగూడెం
14. మేళ్లచెరువు
15. శ్రీరంగాపురం
16. రామాపురం ఎక్స్ రోడ్డు
17. నవాబ్ పేట్ జంక్షన్
ఈ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది రహదారుల శాఖ. ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్ మెంట్స్, వెహికిల్ అండర్ పాస్ ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Also Read: దానిపై చంద్రబాబు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు: సజ్జల