Ramzan 2026 : రంజాన్ పండుగ ఎప్పుడు.. మార్చి 19 లేదా 20నా.. IAC ఏమంటుందంటే..!
Ramzan 2026 : రంజాన్ పండగను ఎప్పుడు జరుపుకోవాలి.. మార్చి 19న లేదంటే మార్చి 20న నా అనే దానిపై ఐఏసీ క్లారిటీ ఇచ్చింది.
IAC clarity on eid ul fitr ramadan ramadan celebration on march 19 or 20 details here
Ramzan 2026 : మార్చి నెలలో హిందువులకు అత్యంత ముఖ్యమైన ఉగాది పండుగతో పాటుగా.. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ కూడా వస్తోంది. అయితే ప్రతి ఏటా రంజాన్ పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై ప్రతి ఏటా కొంత సందిగ్ధత ఏర్పడుతోంది. అలానే ఈ సంవత్సరం కూడా రంజాన్ పండుగ తేదీలపై కాస్త గందరగోళం నెలకొని ఉంది. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ లోని షావల్ నెల తొలి రోజున రంజాన్ జరుపుకుంటారు. ఈ పండుగకు అత్యంత ముఖ్యమైనదిగా భావించేది నెలవంక దర్శనం.
అయితే భౌగోళిక పరిస్థితులు, ఆయా దేశాల్లో కాలమాన వ్యత్యాసాల వల్ల వేర్వేరు దేశాల్లో నెలవంక దర్శనం సమయం మారుతూ ఉంటుంది. రంజాన్ మాసం ప్రారంభం, ముగింపు అన్ని ఈ నెలవంక దర్శనం మీదనే ఆధారపడి ఉంటాయి. అయితే మన దేశంలో రంజాన్ సెలవును మార్చి 20గా ప్రకటించారు. మరికొన్ని దేశాల్లో మార్చి 19న రంజాన్ అని ప్రకటించారు. మరి ఇంతకు రంజాన్ పండుగ ఎప్పుడు మార్చి 19, 20న అనే దానిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన పరిశీలనా కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది.
అరబ్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో రంజాన్ ఉపవాసాలు ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆయా దేశాల్లో మార్చి 18న నెలవంక కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందువల్ల ఆ దేశాల్లో మార్చి 19న రంజాన్ పండుగ జరుపుకునేందుకు అవకాశముందని తెలిపింది.
ఇదిలా ఉంటే మన దేశంలో రంజాన్ ఉపవాసాలు ఫిబ్రవరి 19న ప్రారంభం అయ్యాయి. కనుక నెలవంక దర్శనం మార్చి 19న ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ఇండియాలో మార్చి 20న ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకునేందుకు అవకాశం ఉందని మత పెద్దలు చెబుతున్నారు.
తెలంగాణలో రంజాన్ సెలవులు
తెలంగాణ ప్రభుత్వం మార్చి 21, 22 రంజాన్ సెలవులుగా ప్రకటించింది. అయితే నెలవంక దర్శనం ఆధారంగా ఇవి కూడా మారే అవకాశం ఉంది అంటున్నారు.
