Prabhas Shoe Size : ప్రభాస్ సైజ్ బట్టలు, షూస్ బయట దొరకవంట.. ప్రభాస్ షూ సైజ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రభాస్ బట్టలు, షూస్ గురించి కూడా మాట్లాడాడు. వీటి గురించి మాట్లాడుతూ నీకు బయట రెడీమేడ్ గా బట్టలు దొరుకుతాయా అసలు, లేదా కుట్టించుకోవడమేనా అని బాలకృష్ణ అడగడంతో ప్రభాస్ దీనికి సమాధానమిస్తూ.............

Prabhas Shoe Size :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ పూర్తికాగా ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.

ప్రభాస్ అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Prabhas : ప్రభాస్ కి ఈ డైరెక్టర్స్ తో పని చేయాలని ఉందట..

ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ప్రభాస్ సినిమాలు, పెళ్లి.. ఇలా అనేక టాపిక్స్ ప్రస్తావించాడు బాలయ్య. అలాగే ప్రభాస్ బట్టలు, షూస్ గురించి కూడా మాట్లాడాడు. వీటి గురించి మాట్లాడుతూ నీకు బయట రెడీమేడ్ గా బట్టలు దొరుకుతాయా అసలు, లేదా కుట్టించుకోవడమేనా అని బాలకృష్ణ అడగడంతో ప్రభాస్ దీనికి సమాధానమిస్తూ.. అంత తొందరగా నాకు బయట దొరకవు, నా ఫ్రెండ్ భాస్కర్ అని ఫ్యాషన్ డిజైనర్ ఉన్నాడు అతనే నా డ్రెస్స్ లు అన్నీ డిజైన్ చేస్తాడు. ఇక షూస్ అయితే చాలా కష్టం. బయట షాప్స్ లో 10 సైజ్ వరకే ఉంటుంది. నా షూ సైజ్ 12.5 దొరకాలంటే చాలా కష్టం అన్నాడు. దీంతో ప్రభాస్ షూ సైజ్ తెలుసుకొని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు