Ambulance 108 : అంబులెన్స్‌కు 108 నంబర్ పెట్టటం వెనుక ఇంత అర్థం, చరిత్ర ఉందా..?

అంబులెన్స్ నంబర్ 108కు ఉన్న ప్రత్యేకత ఏంటీ..? ఈ నంబర్ వెనుకున్న అర్థమేంటీ..ఛరిత్ర ఏంటీ..?హిందూ సంప్రదాయంలో 108 కి అంబులెన్స్ కు ఉన్న సంబంధమేంటీ..ఈ సువిశాల విశ్వంలో ఉండే గ్రహాలకు అంబులెన్స్ కు ఉన్న 108 నంబర్ కు సంబంధముందా? విశ్వానికి..సంప్రదాయాలకు 108 నంబరుకు ఉన్న లింకులేంటీ.?ఆ లెక్కలేంటీ..?

108 ambulance

Ambulance 108 : అంబులెన్స్. ప్రాణాప్రాయంలో ఉన్నవారికి ప్రాణంపోసే వాహనం. ఈ వాహనం ఓ చిన్నపాటి ఆస్పత్రిలాంటిది. యాక్సిడెంట్ అయినా..ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నా ఠక్కున గుర్తుకొస్తుంది అంబులెన్స్. ఆ వాహనానికి నంబర్ 108 (Ambulance 108)అనే విషయం అందరికి తెలిసిందే. 108కు డయల్ చేసి హలో అంటే చాలు కుయ్ కుయ్ మంటూ వచ్చేస్తుంది. ఆ వాహనంలో ప్రథమ చికిత్స అందించే సిబ్బంది ఉంటారు. వెంటనే ఆస్పత్రికి తరలించి బాధితుల ప్రాణాలు కాపాడుతారు. అటువంటి అంబులెన్స్ కు 108 అనే నంబర్ పెట్టటం వెనుక చాలా అర్థం ఉంది. 108 నంబర్ (Ambulance 108)వెనుక పెద్ద చరిత్రే ఉంది. ప్రమాదాల్లో గాయపడిని వారికి 108 అనేది సంజీవని అని చెప్పాల్సిందే.108 నంబర్ వెనుక ఆస​క్తికర అంశాలున్నాయనే విషయం మీకు తెలుసా..? అసలు ఈ 108 నంబర్ ఎందుకు పెట్టారు? అనే ఆసక్తి మీకెప్పుడైనా కలిగిందా..? అయితే 108 నంబర్ వెనుక ఉన్న ఆసక్తికర కారణాలు ఏంటో తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో 108 ప్రాముఖ్యత
భారతదేశంలో హిందూ సంప్రదాయానికి చాలా చరిత్రే ఉంది. అటువంటి హిందూ సంప్రదాయంలో 108 అనే నంబర్‌కి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే నంబర్ కీలకమైనదిగా ఉంది. 108 పత్రాలతో పూజ, 108 దళాలతో పూజ,జపమాలలో కూడా 108 రుద్రాక్షలు, లేదా పూసలు ఉంటాయి. అలాగే గుడి చుట్టు 108 సార్లు ప్రదిక్షణలు..ముక్తినాథ్ దేవాలయంలో 108 నందులు ముఖాలు..మంత్రోచ్ఛారణ 108, ఇలా హిందూ సంప్రదాయంలో 108కి చాలా చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. అంతేకాదు జపాన్ లో జైన ఆలయాల్లో నూతన సంవత్సరం ప్రారంభం రోజున 108 సార్లు గంటలు కొడతారు.

100 Rupees Note : కొత్త రూ.100 నోటు వెనుకున్న ఈ బొమ్మ గురించి తెలుసా..? ఈ అద్భుత నిర్మాణం వెనుక ఓ రాణి

108ని కూడితే వచ్చేది తొమ్మిది. అంతేకాదు ఏ సంఖ్యను అయినా 9 సార్లు హెచ్చించి కూడినా వచ్చే సంఖ్య తొమ్మిదే అవుతుంది. తొమ్మిది గ్రహాలు 12 రాశుల ద్వారా ప్రయాణిస్తాయి. వీటిని గుణించినా 9 x 12 = 108 వస్తుంది. ప్రాచీనకాలం నాటి తాళపత్ర గ్రంథాల్ని అనుసరించి విశ్వం 108 అంశాల కలయికతో ఏర్పడింది అంటారు. ఇక పూజలో అష్టోత్తరంఅంటే 108 మంత్రాలు. వైష్ణవం ప్రకారం దేశంలోని ప్రముఖ విష్ణు దేవాలయాలు 108. పాల సముద్రాన్ని మథించినప్పుడు 108 మంది ఆదిశేషునికి ఇరువైపులా ఉన్నారట. వీరిలో దేవతలు 54 మంది, రాక్షసులు 54 మంది. ఇలా చెప్పుకుంటు పోతే హిందూ సంప్రదాయంలో 108కి ఉన్న ప్రాముఖ్యత ప్రాశస్త్ర్యం ఎంతో ఉంది.

ఖ‌గోళ ప‌రంగా 108 ప్రాధాన్యత..
-సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు అని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత 13,91000 కి.మీ. తో భాగిస్తే వచ్చే సంఖ్య దాదాపుగా 108.
-చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లు. (3,84,403)దాన్ని చంద్రుని చుట్టుకొలత అయిన 3474 కి.మీ. తో భాగిస్తే వచ్చే సంఖ్య 108.
-27 న‌క్ష‌త్రాలు, ప్ర‌తి న‌క్ష‌త్రానికి 4 పాదాలు 27 నక్షత్రాలను నాలుగు పాదాలు అంటే నాలుగు సంఖ్యతో గుణిస్తే వచ్చే సంఖ్య 108

శాస్త్రం ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21,600 సార్లు శ్వాస తీసుకుంటారట. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ని ఆరోగ్యం ప్రకారంగా చెప్పే లెక్క‌. ఈ లెక్క ప్ర‌కారం మ‌నిషి శ్వాస తీసుకునే చివ‌ర ఉన్న రెండు సున్నాలు తీసివేస్తే మిగిలిన సంఖ్య 108. అలా 108ని ప్రామాణికంగా తీసుకుని ఈ 108ని అంబులెన్స్ కు ఏర్పాటు చేశారు.

సైకాలజి పరంగా 108 ప్రాముఖ్యత
సైకాలజి పరంగా చూసుకున్నా 108 ప్రత్యేకత ఉంది. మనిషి నిరాశ, డిప్రెషన్‌లో ఉన్న సమయంలో వారి చూపు ఫోన్ లో ఎడమ భాగం వైపున చివరికి వెళ్తుందట. అయితే అక్కడ 0,8 దగ్గరగా ఉండడం వల్ల 108 ని ఎమర్జెన్సీ నంబర్‌గా ఎంచుకుని ఉంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మొదటి సంఖ్య ఏది అంటే ‘ఒక్కటి అని ఎవరైనా చెబుతారు ఆ 1 మగవారిని,0 ఆడవారిని సూచిస్తాయట. ఇక 8వ నంబర్ ఇన్ఫినిటీ సూచిస్తుందని.. అందువల్లే. అంబులెన్స్ కు 108 సంఖ్యని ఉపయోగిస్తున్నారని మరికొందరు అభిప్రాయం..ఏది ఏమైనా 108 నంబర్ ఏ రకంగా రూపొందించినా అంబులెన్స్ 108 నంబర్ ఎంతోమంది ప్రాణాల్ని కాపాడుతోంది.



ట్రెండింగ్ వార్తలు