Dog in Mumbai local train : ముంబయి లోకల్ ట్రైన్ రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అయితే డెయిలీ ఓ డాగ్ కూడా ఇక్కడి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుంది. అవును.. నిజమే. ఇప్పుడు ఈ డాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
ముంబయి లోకల్ ట్రైన్లో నిత్యం ఎంతోమంది ప్రయాణిస్తుంటారు. రోజు వారి పనుల మీద వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వీటిపైనే ఆధారపడతారు. అయతే ఓ డాగ్ కూడా ప్రతిరోజు లోకల్ ట్రైన్ ఎక్కుతోంది. బోరివాలి నుండి అంధేరి స్టేషన్ వరకు అది ప్రయాణం చేస్తుందట. ఇక ఈ డాగ్ ట్రైన్ ఎక్కాక ఎవరినీ ఇబ్బంది పెట్టదట. ప్రశాంతంగా నేలపై కూర్చోవడం, లేదా పడుకోవడం.. ట్రైన్ తలుపు దగ్గర తన జర్నీని ఆస్వాదిస్తూ నిలబడటం చేస్తుందట. విచిత్రంగా ఉంది కదా. indiaculturalhub అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ‘రెగ్యులర్ ట్రావెలర్ ని కలవండి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది
dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్
‘ నేను ఖచ్చితంగా ఆ డాగ్‌ను ఆ ప్రాంతానికి వెళ్లి కలవాలనుకుంటున్నాను’ అని ఒకరు.. ‘నేను దానిని చూసాను. రాత్రికి అంథేరికి వస్తాడు’ అని మరొకరు కామెంట్లు పెట్టారు. ఈ డాగ్ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తోందో? లేక ఈ రూట్లో ఏం పనో? అని కొందరు ఫన్నీగా నవ్వుకుంటున్నారు.