సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

CBSE Results 2024: సీబీఎస్ఈ పదో తరగతిలో 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

CBSE

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. cbseresults.nic.inలో స్కోరు చూసుకోవచ్చు. ఈ వెబ్ ఓపెన్ చేసి అందులో రోల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేస్తే ఫలితాలు వస్తాయి.

సీబీఎస్ఈ పదో తరగతిలో 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 47,983 మంది విద్యార్థులకు 95 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. తిరువనంతపురంలో అత్యధికంగా 99.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరిగాయి. కాగా, 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

బాలికలే పై చేయి సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 91.52 శాతం మంది అమ్మాయిలు, 85.12 శాతం మంది బాలురు ఉన్నారు. తిరువనంతపురంలో అత్యధికంగా 99.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. విద్యార్థుల్లో అనారోగ్య పోటీతత్వాన్ని లేకుండా చేసేందుకు మెరిట్ జాబితాను సీబీఎస్ఈ ప్రకటించడం లేదన్న విషయం తెలిసిందే.

వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

ట్రెండింగ్ వార్తలు