ఓటర్‌ను చెంపదెబ్బ కొట్టిన వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వెళ్లారు. క్యూలైన్ ఉండటంతో.. క్యూలైన్ కాకుండా ఓటు వేసేందుకు నేరుగా వెళ్లారు.

ఓటర్‌ను చెంపదెబ్బ కొట్టిన వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

MLA Candidate VS Voters Fight in Tenali

Updated On : May 14, 2024 / 9:31 AM IST

MLA Annabathuni Siva kumar : గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ ఓ ఓటరుపై చేయిచేసుకున్నారు. వెంటనే ఓటరుసైతం ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో వైసీపీ శ్రేణులు ఓటరుపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Also Read : పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వెళ్లారు. క్యూలైన్ ఉండటంతో.. క్యూలైన్ కాకుండా ఓటు వేసేందుకు నేరుగా వెళ్లారు. దీంతో క్యూలైన్ లో ఉన్న ఓ ఓటరు క్యూలైన్ ఉంటే మీరు నేరుగా ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ ఓటరుపై చేయిచేసుకున్నాడు. వెంటనే ఓటరుసైతం ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టాడు. పక్కనే ఉన్న వైసీపీ నేతలు ఓటరుపై ఒక్కసారిగా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈఘటనతో ఓటువేసేందుకు వచ్చిన మహిళలు అక్కడి నుంచి భయంతో పక్కకు తప్పుకున్నారు.

Also Read : Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?