Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?

నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై సినీ నటుడు అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు.

Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?

Allu Arjun

Updated On : May 13, 2024 / 9:20 AM IST

Allu Arjun Comments On Nandyal Incident : నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడంపై సినీ నటుడు అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం హైద‌రాబాద్‌ జూబ్లిహిల్స్ లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో ఓటువేసిన అల్లు అర్జున్.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

”నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మా మావయ్య, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. శిల్పా రవికి మద్దతిస్తానని గతంలో మాట ఇచ్చా. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్లా. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సులు లేద”ని అల్లు అర్జున్ అన్నారు.