Patient Arrives At Polling Booth On Stretcher
ఉద్యోగం ఉందనో, బద్ధకం వల్లనో చాలా మంది ఓటు వేయకుండా కూర్చుంటారు. అటువంటిది ఓ క్యాన్సర్ రోగి స్ట్రెచర్‌పై పోలింగ్ బూత్ కి వెళ్లి మరీ ఓటు వేసి వచ్చింది. బిహార్‌లోని దర్భంగాలో ఈ ఘటన చోచేసుకుంది. సుభద్రా దేవి అనే మహిళ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
ఆహారం కూడా తీసుకోకుండా నాలుగు రోజులుగా మంచి నీరు తాగుతూ బతుకుతున్నారు. అయినప్పటికీ ఓటు వేయాలని అనుకున్నారు. సుభద్రా దేవి కుమారుడు విజయ్ కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ స్థానిక పాఠశాలలోని పోలింగ్ బూత్ కు ఆమెను స్ట్రెచర్‌పై తీసుకొచ్చామని తెలిపాడు.
తన తల్లి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పాడు. జీవితపు చివరి రోజుల్లో కూడా ఆమె ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించిందని తెలిపాడు. ఓటు వేస్తానని చెప్పడంతో పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చామని అన్నాడు. సుభద్ర స్ట్రెచర్ పై వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ చాలా మంది వీల్ చైర్ పై పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓట్లు వేశారు.
Also Read: వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?