MS Dhoni : చిన్న త‌లాను మైదానంలో చూడ‌గానే ఎంఎస్ ధోని ఏం చేశాడంటే?

భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోని, మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనాకు మ‌ధ్య ఉన్న స్నేహ‌బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

screengrab from video posted on x by@CSK

MS Dhoni – Suresh Raina : భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోని, మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనాకు మ‌ధ్య ఉన్న స్నేహ‌బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వీరిద్ద‌రు టీమ్ఇండియా త‌రుపున ఎంతో కాలం ఆడారు. అటు ఐపీఎల్‌లోనూ క‌లిసే ఆడారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎదురులేని జ‌ట్టుగా తీర్చిదిద్ద‌డంలో వీరిద్ద‌రు కీల‌క పాత్ర పోషించారు. అందుక‌నే చెన్నై అభిమానులు ముద్దుగా ఎంఎస్ ధోని త‌లా అని, సురేశ్ రైనా చిన్న త‌లా అని పిలుచుకుంటూ ఉంటారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ నుంచి రిటైర్‌మెంట్ అయిన త‌రువాత సురేశ్ రైనా ప్ర‌స్తుతం కామెంటేట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. కాగా.. ఆదివారం చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ అనంత‌రం ధోని ‘ల్యాప్ ఆఫ్ హాన‌ర్‌’ను నిర్వ‌హించారు. జ‌ట్టు స‌భ్యుల‌తో తాను సంత‌కాలు చేసిన‌ బంతుల‌ను టెన్నిస్ రాకెట్‌తో కొట్టి అభిమానుల‌కు అందించాడు.

RCB : బెంగ‌ళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై పై ఎంత తేడాతో గెల‌వాలంటే..?

ధోని ఈ ప‌నిలో ఉండ‌గా స‌డెన్‌గా సురేశ్ రైనా క‌నిపించాడు. వెంట‌నే మ‌హేంద్రుడు అత‌డిని కౌగిలించుకున్నాడు. ఆ త‌రువాత త‌న చేతిలోని టెన్నిస్ రాకెట్‌ను ఇచ్చి బంతుల‌ను ప్రేక్ష‌కుల వైపుకు కొట్టాల‌ని సూచించాడు. రాకెట్ అందుకున్న రెనా ముందుగా ధోని దిశ‌గా కొడుతున్న‌ట్లు అత‌డిని ఆట ప‌ట్టించాడు. అనంత‌రం అభిమానుల వైపు కొట్టాడు. వెంట‌నే మ‌ళ్లీ రాకెట్‌ను ధోనికి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రాజ‌స్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని చెన్నై 18.2 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో సీఎస్‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ఎగ‌బాకింది. లీగులో త‌న ఆఖ‌రి మ్యాచ్‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ఆడ‌నుంది. ఈమ్యాచ్‌లో గెలిస్తే చెన్నై ప్లే ఆఫ్స్ కు వెలుతుంది.

Dinesh Karthik : ఐపీఎల్‌లో చ‌రిత్ర‌లోనే దినేశ్ కార్తీక్ చెత్త రికార్డు.. ఆనందంలో రోహిత్ శ‌ర్మ అభిమానులు..!

ట్రెండింగ్ వార్తలు