Dinesh Karthik : ఐపీఎల్‌లో చ‌రిత్ర‌లోనే దినేశ్ కార్తీక్ చెత్త రికార్డు.. ఆనందంలో రోహిత్ శ‌ర్మ అభిమానులు..!

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Dinesh Karthik : ఐపీఎల్‌లో చ‌రిత్ర‌లోనే దినేశ్ కార్తీక్ చెత్త రికార్డు.. ఆనందంలో రోహిత్ శ‌ర్మ అభిమానులు..!

PIC Credit : RCB

Dinesh Karthik ducks in IPL : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఎవ్వ‌రూ కోరుకోని రికార్డును న‌మోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న కార్తీక్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ‌, గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డుల‌ను బ్రేక్ చేశాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్లు అయిన ఆట‌గాళ్లు..

దినేష్ కార్తీక్ – 18
గ్లెన్ మాక్స్‌వెల్ – 17
రోహిత్ శర్మ – 17
పీయూష్ చావ్లా – 16
సునీల్ నరైన్ – 16
మన్‌దీప్ సింగ్ – 15
ర‌షీద్ ఖాన్ – 15

Virat Kohli : సింహంతో ప‌రాచ‌కాలా..! మ‌న‌కెందుకు ఇషాంత్‌..! చూడు ఇప్పుడు ఏమైందో..?

కాగా.. ఇన్నాళ్లు ఈ రికార్డు మాక్స్‌వెల్‌, కార్తీక్‌, రోహిత్ శ‌ర్మ‌లు సంయుక్తంగా క‌లిగి ఉన్నారు. ఇప్పుడు కార్తీక్ మ‌రోసారి డ‌కౌట్ అయి ఈ రికార్డును త‌న పేరిట న‌మోదు చేయ‌డంతో టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అభిమానులు చాలా ఖుషిగా ఉన్నారు. ఈ చెత్త రికార్డు ప్ర‌స్తుతానికి రోహిత్ పేరిట లేక‌పోవ‌డంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కార్తీక్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆర్‌సీబీ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో బెంగ‌ళూరు 47 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీకి ఇది వ‌రుస‌గా ఐదో విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ గెలుపుతో మిణుకుమిణుకు మంటున్న త‌న ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను ఆర్‌సీబీ స‌జీవంగా ఉంచుకుంది.

KKR : ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా కోల్‌క‌తా.. షాకిచ్చిన బీసీసీఐ