parliament monsoon session: 32 బిల్లులు ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌.. 14 మాత్ర‌మే సిద్ధంగా ఉన్నాయ‌ట‌: ఖ‌ర్గే

పార్ల‌మెంటు స‌మావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో నిర్వ‌హించిన అఖిలప‌క్ష స‌మావేశంలో తాము 13 అంశాల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచామ‌ని కాంగ్రెస్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే అన్నారు. ఈ స‌మావేశాల్లో 32 బిల్లులు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింద‌ని, అయితే, వాటిలో 14 బిల్లులు మాత్ర‌మే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆ 14 బిల్లుల గురించి కూడా ప్ర‌భుత్వం త‌మ‌కు చెప్ప‌లేద‌ని అన్నారు.

parliament monsoon session: పార్ల‌మెంటు స‌మావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో నిర్వ‌హించిన అఖిలప‌క్ష స‌మావేశంలో తాము 13 అంశాల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచామ‌ని కాంగ్రెస్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే అన్నారు. ఈ స‌మావేశాల్లో 32 బిల్లులు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింద‌ని, అయితే, వాటిలో 14 బిల్లులు మాత్ర‌మే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆ 14 బిల్లుల గురించి కూడా ప్ర‌భుత్వం త‌మ‌కు చెప్ప‌లేద‌ని అన్నారు. అంతేగాక‌, ఈ సెష‌న్‌లో కేవ‌లం 14 రోజులు మాత్ర‌మే పార్ల‌మెంటు ప‌ని దినాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

CM KCR : సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఆకస్మిక వరదల వెనుక విదేశీ కుట్రలు

ఈ కొన్ని రోజుల్లోనే 20 అంశాలపై చ‌ర్చించాల‌ని, 32 బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంద‌ని అన్నారు. చైనా చొర‌బాట్లు, విదేశీ విధానం, అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టంలో మార్పులు, జ‌మ్మూక‌శ్మీర్‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, కాంగ్రెస్ నేత‌ల‌పై దాడులు వంటి అంశాల‌ను కూడా పార్ల‌మెంటు స‌మావేశాల్లో చ‌ర్చించాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. విప‌క్ష పార్టీల నేత‌ల స‌మావేశం కాసేపట్లో జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు. అన్ని విప‌క్ష‌ పార్టీలు క‌లిసి పార్ల‌మెంటులో లేవ‌నెత్తాల్సిన అంశాల‌పై చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న అన్నారు. కాగా, సమావేశాలను సజావుగా సాగనివ్వాలని అడ్డంకులు సృష్టిించవద్దని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష పార్టీలను కోరారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏయే సమస్యలపై నిలదీయాలన్న విషయాలపై విపక్ష పార్టీలు వ్యూహాలు రచించుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు