Prank went wrong : ప్రాంక్ కాస్తా తుస్సుమంది.. పెళ్లికొడుకు పీకుడికి బావమరిదికి చుక్కలు కనిపించాయి..

ప్రాంక్‌లు కొన్ని సరదాగా ఉంటాయి. కొన్నిశృతి మించితే ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత తన్నులాడుకునే వరకూ పరిస్థితి వస్తుంది. ఓ పెళ్లివేడుకలో పెళ్లికొడుకు బావమరిది చేసిన ప్రాంక్ రివర్సై తన్నులు తిన్నాడు.

Prank went wrong : ఒక్కోసారి సరదాగా చేసే చిలిపి పనులు (prank) దుమారాన్ని క్రియేట్ చేస్తాయి. సందడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తా గందరగోళం చేస్తాయి. ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు (groom) బావమరిది (brother-in-law) సరదాగా చేసిన పని తన్నులాటకు దారితీసింది.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

పెళ్లిళ్లలో వధూవరుల్ని ఆటపట్టించడం కామనే. వారి వస్తువుల్ని దాచిపెట్టడం.. ఫన్నీ కామెంట్లు చేయడం.. సరదా గిఫ్ట్ లు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అన్ని వేళలా వేళాకోళం తగదు అన్నట్లు ఓ పెళ్లిలో పెళ్లికొడుకు బావమరిది పెళ్లికొడుకు పట్ల ప్రవర్తించిన తీరు పెళ్లికొడుక్కి చిరాకు తెప్పించింది. ఒక చోట పెళ్లి వేడుక జరుగుతోంది. వధూవరులిద్దరూ కూర్చుని ఉన్నారు. వేదిక చుట్టూ బంధువులు అంతా నిలబడి ఉన్నారు. పెళ్లికొడు బావమరిది పెళ్లికొడుకు వెనుకకు వెళ్లి నిలబడ్డాడు. నుంచున్నవాడు తిన్నగా ఉండకుండా వరుడి పగిడీని (pagdi) సర్దడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా పగిడీని తీయడం పెట్టడం చేసి పెళ్లికొడుకుని తెగ విసిగించాడు. ఇక అతని బుగ్గలు గట్టిగా నొక్కడంతో పెళ్లికొడుక్కి చిర్కెత్తుకొచ్చి ఒక్కసారి అతనిపై విరుచుకుపడ్డాడు. లాగిపెట్టి కొట్టడం మొదలుపెట్టాడు. ఇక పెళ్లికూతురితో సహా అక్కడ ఉన్నవారంతా వారిని విడదీయడానికి తిప్పలు పడ్డారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్

Arhant Shelby అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేయడంతో చాలామంది వీడియోని చూసారు. పెళ్లికొడుకు బావమరిదికి బాగా బుద్ధి చెప్పాడని కామెంట్స్ పెడుతూ అతనికి మద్దతు ఇచ్చారు. సరదాకైనా సమయం సందర్భం ఉంటుందని అతి చేస్తే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు