Rajamouli : మరోసారి రాజమౌళికి ఆస్కార్‌ ఆహ్వానం..

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ అకాడమీ)లో చేరమని రాజమౌళికి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది.

Rajamouli his Wife Rama Rajamouli and Some Indian Film Celebrities gets Invitation to join in Oscar Academy

Rajamouli : తెలుగు సినిమాకు ఊహించని ఆస్కార్ ని రాజమౌళి RRR సినిమా రూపంలో తీసుకొచ్చారు. అసలు ఆస్కార్ వేదిక పైకి అయినా తెలుగు సినిమాలు వెళ్తాయా అనుకునే వాళ్ళు కానీ ఏకంగా ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. రాజమౌళి RRR సినిమాతో హాలీవుడ్ లో బాగా వైరల్ అయ్యారు. హాలీవుడ్ స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ కూడా రాజమౌళిని కలిసి ప్రశంసించారు.

తాజాగా రాజమౌళి మరోసారి ఆస్కార్ కి వెళ్లనున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ అకాడమీ)లో చేరమని రాజమౌళికి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళికి కూడా ఆహ్వానం అందింది. గత సంవత్సరం రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ కుమార్.. ఇలా పలువురుకు ఆహ్వానంఅందగా ఈసారి రాజమౌళి, రమా రాజమౌళితో పాటు షబానా అజ్మీ, రితేష్ సిధ్వాని, రవి వర్మన్.. పలు బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల నుంచి 487 మంది కొత్తవారికి ఈ ఆహ్వానం అందింది.

Also Read : Allu Sirish : మా నాన్న కూడా నా మీద ఇంత డబ్బు పెట్టి సినిమా తీయలేదు.. అల్లు శిరీష్ వ్యాఖ్యలు..

ఆస్కార్ అకాడమీలో భాగమైతే ఆస్కార్ సినిమాలకు ఓటు వేసే హక్కు వస్తుంది. అలాగే స్పెషల్ స్క్రీనింగ్స్, పలు వర్క్ షాప్స్, సెమినర్స్ కి వెళ్లొచ్చు. అకాడమీ జరిపే ఈవెంట్స్ కి వెళ్లొచ్చు. అకాడమీ లైబ్రరీకి కూడా యాక్సెస్ ఉంటుంది. అలాగే సినిమా గురించి సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకుంటారు ఈ మెంబర్స్ నుంచి. దీంతో రాజమౌళి, రమా రాజమౌళికి అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.