Allu Sirish : మా నాన్న కూడా నా మీద ఇంత డబ్బు పెట్టి సినిమా తీయలేదు.. అల్లు శిరీష్ వ్యాఖ్యలు..

అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.

Allu Sirish : మా నాన్న కూడా నా మీద ఇంత డబ్బు పెట్టి సినిమా తీయలేదు.. అల్లు శిరీష్ వ్యాఖ్యలు..

Allu Sirish Buddy Movie Trailer Launch Event Highlights

Allu Sirish Buddy Trailer Launch Event : అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో శామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బడ్డీ. ఓ టెడ్డీబేర్ ప్రధాన పాత్రలో యాక్షన్ సినిమాగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూలై 26న ఈ బడ్డీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. టెడ్డి బేర్ ప్రధాన పాత్ర సినిమా కావడంతో యాంకరింగ్ కూడా ఈ సినిమా ఈవెంట్ కి చిన్న పాపతో చేయించారు. ఈ కార్యక్రమానికి శ్రేయాస్ శ్రీనివాస్ కూతురు ఆద్య క్యూట్ గా యాంకరింగ్ చేసింది.

Allu Sirish Buddy Movie Trailer Launch Event Highlights

బడ్డీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తెలుగు ఆడియెన్స్ ను, ఇక్కడి మంచి ఫుడ్ ను మిస్ అవుతుంటాను. గత 15 ఏళ్లుగా మా స్టూడియో గ్రీన్ సినిమాలను ఆదరిస్తున్నారు. నేను ఈ కథ కంటే కూడా దర్శకుడు శామ్ ను ఎక్కువ నమ్మాను. నాకు ఇంకో మంచి సినిమా ఇస్తున్నాడు. పుష్ప సినిమా ఎడిటర్ రూబెన్ దీనికి పని చేస్తున్నారు. కంగువ సినిమాకు వీఎఫ్ఎక్స్ చేసే హరిహర సుతన్ ఈ బడ్డీకి కూడా చేస్తున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్టులు చాలా న్యాచురల్ గా ఉంటాయి. అల్లు శిరీష్ మా ఫ్యామిలీ మెంబర్. మా బ్యాడ్ టైమ్స్ లో కూడా శిరీష్ మాకు సపోర్ట్ గా నిలిచాడు. మా ఆవారా సాంగ్స్ మధుర ఆడియోలో రిలీజ్ చేశాం. అప్పటి నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మధుర శ్రీధర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. జూలై 26న బడ్డీ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ.. లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా అని చాలా మంది అడిగారు. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వాళ్లకు ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారు అని వదిలేశా. బడ్డీ విషయంలో టెడ్డీ బేర్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ వర్కౌట్ అవుతుందా అని అనుమానం ఉండేది. కానీ ఇవాళ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. శామ్ గారి 100 అనే సినిమా చూసి ఆయనకు ఫోన్ చేసి ఏదన్నా కథ ఉంటె చెప్పండి చేద్దాం అన్నాను. అది ఆయన గుర్తుపెట్టుకొని నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్ కు ఇంప్రెస్ అయ్యే నేను ఈ సినిమా చేశాను. మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు కానీ జ్ఞానవేల్ గారు తీశారు అని అన్నారు.

హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ.. నాకు బడ్డీ సినిమా కథ చెప్పినప్పుడే ఇదొక స్పెషల్ ఫిల్మ్ అవుతుందని నమ్మాను. పిల్లలు పెద్దలు యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. అల్లు శిరీష్ నుంచి యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది.

హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ.. సినిమాలో శిరీష్ కెప్టెన్ ఆదిత్యరామ్ గా కనిపిస్తారు. నాకు శిరీష్ కంటే కూడా ఆదిత్యరామ్ గా క్యూట్ గా కనిపించాడు. ఇంత పెద్ద సంస్థలో కెరీర్ ఆరంభంలోనే సినిమా రావడం సంతోషంగా ఉందని తెలిపింది.

నటుడు అజ్మల్ మాట్లాడుతూ – తెలుగులో ఇటీవల మంగళవారం సినిమాతో హిట్ కొట్టాను. రంగం సినిమా నుంచి మీరు నన్ను ఆదరిస్తున్నారు. అల్లు శిరీష్ తో నాకు ఫైట్ సీక్వెన్సులు ఉన్నాయి. ఆయనతో ఎదురుగా నిల్చుని ఫైట్ చేస్తున్నప్పుడు నా ముందు టామ్ క్రూయిజ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం శిరీష్ తనను తాను చాలా మర్చుకున్నాడు అని తెలిపారు.

Also Read : Buddy trailer : అల్లు శిరీష్ ‘బ‌డ్డీ’ ట్రైల‌ర్‌.. అన్యాయంపై తిరగబ‌డ్డ టెడ్డీబేర్‌ను చూశారా..?

కమెడియన్ అలీ మాట్లాడుతూ.. దర్శకుడు శామ్ నాకు ఫోన్ చేసినప్పుడు తమిళ్ సినిమా అనుకున్నా. కానీ శిరీష్ హీరో అని చెప్పారు. మేము థాయ్ లాండ్ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ జనాలు బడ్డీతో ఫొటోస్ తీసుకునేవారు. ఈ సినిమాను జపాన్, చైనాలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. వేరే భాషల్లో కూడా ఈ సినిమా సీక్వెల్ చేసేంత సక్సెస్ అవ్వాలి అని అన్నారు.

డైరెక్టర్ శామ్ ఆంటోన్ మాట్లాడుతూ.. జ్ఞానవేల్ రాజా గారి నిర్మాణంలో నా మొదటి సినిమా డార్లింగ్ చేశాను. ఫస్ట్ మూవీ నుంచే నాపై జ్ఞానవేల్ రాజా గారికి నమ్మకం ఉంది. ఈ సినిమా డిస్కషన్ జరిగినప్పుడు నన్ను కనీసం స్క్రిప్ట్ కూడా అడగలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ సినిమా ఇచ్చారు. ఫైనల్ వెర్షన్ సినిమా జ్ఞానవేల్ గారికి బాగా నచ్చింది. నేను రాజమౌళి గారి ఫ్యాన్ ను. ఆయన చేసిన ఈగ సినిమా ఈ బడ్డీ మూవీకి ఇన్సిపిరేషన్. బడ్డీకి సీజీ వర్క్ చేసేటప్పుడు ఈగ మూవీతో పోల్చి సజెషన్స్ చెప్పేవాడిని అని తెలిపారు.