Buddy trailer : అల్లు శిరీష్ ‘బడ్డీ’ ట్రైలర్.. అన్యాయంపై తిరగబడ్డ టెడ్డీబేర్‌ను చూశారా..?
ఊర్వశివో రాక్షసీవో సినిమా తరువాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం బడ్డీ.

Allu Sirish Buddy trailer out now
‘ఊర్వశివో రాక్షసీవో’ సినిమా తరువాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోన్న ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ కీలక పాత్రల్లో నటించారు. హిప్‌హాప్ తమిజా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పాట అభిమానులను అలరించాయి.
VD14 : ఈ తూరి సినిమా అంతా మన సీమలోనే.. రాయలసీమ వాళ్లకు విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్..
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు అన్యాయం జరిగినా.. ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని చూసుంటారు. అన్యాయం పై తిరగ బడ్డ టెడ్డీబేర్‌ను చూశారా..? అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.
ట్రైలర్‌లో టెడ్డీబేర్ విలన్లను చితక్కొట్టింది. కాగా.. ఈ టెడ్డీబేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో అల్లు శిరీష్ కనిపించాడు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపుదిద్దుకున్నట్లుగా ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.