VD14 : ఈ తూరి సినిమా అంతా మన సీమలోనే.. రాయలసీమ వాళ్లకు విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్..
విజయ్ దేవరకొండ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడే వారి కోసం అక్కడే రాయల సీమలోనే ఆడిషన్స్ కూడా నిర్వహించి నటీనటులను తీసుకోబోతున్నారు.

Vijay Deverakonda VD 14 Movie Auditions in Rayalaseema for who speak Rayalaseema Slang here Details
VD14 : విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ సినిమాలు చేస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా VD14 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాయలసీమలో 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన పీరియాడిక్ కథ అని హింట్ ఇస్తూ ఓ యోధుడు ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమాలో నటించడానికి కొత్తవాళ్ళని తీసుకుంటున్నారు. అందుకోసం ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో రాయలసీమ యాస మాట్లాడే వారి కోసం అక్కడే రాయల సీమలోనే ఆడిషన్స్ కూడా నిర్వహించి నటీనటులను తీసుకోబోతున్నారు. తాజాగా ఈ ఆడిషన్స్ డీటెయిల్స్ తెలిపారు.
జులై 1,2 లో కర్నూల్ లోని జెండా పార్క్ వద్దనున్న ఇందిరమ్మ కమ్యూనిటీ హాల్ లో ఆడిషన్స్ జరగనున్నాయి.
జులై 3,4 లో కడప మున్సిపల్ హైస్కూల్ పక్కన ఉన్న YSR ఆడిటోరియం లో ఆడిషన్స్ జరగనున్నాయి.
జులై 5,6 లో తిరుపతి VRR ఫంక్షన్ హాల్ లో ఆడిషన్స్ జరగనున్నాయి.
జులై 8,9 లో అనంతపూర్ లోని అనంత షిర్డీ సాయి కల్యాణ మండపంలో ఆడిషన్స్ జరగనున్నాయి.
ఈ డీటెయిల్స్ తో పాటు మీ డీటెయిల్స్ పంపడానికి ఓ మెయిల్ ఐడి, ఏదైనా సందేహాలు ఉంటే అడగడానికి ఓ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీది రాయలసీమ అయితే, మీకు రాయల సీమ యాసలో మాట్లాడటం వస్తే ఈ ఆడిషన్స్ లో పాల్గొని మీ ట్యాలెంట్ చూపించి విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేయండి.