Pushpa 2 : ‘పుష్ప 2’ తప్పుకోవడంతో.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు లైన్లోకి వచ్చిన ఎన్టీఆర్ బామ్మర్ది, రానా..

పుష్ప 2 షూటింగ్ అవ్వకపోవడంతో సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశారు.

Pushpa 2 : ‘పుష్ప 2’ తప్పుకోవడంతో.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు లైన్లోకి వచ్చిన ఎన్టీఆర్ బామ్మర్ది, రానా..

Allu Arjun Pushpa 2 Postponed Small Movies Target Independence Day Date for Release

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించాడు. దీంతో అభిమానులంతా సినిమా కోసం ఆతృతగా ఎదురుచూసారు. కానీ పుష్ప 2 షూటింగ్ అవ్వకపోవడంతో సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశారు. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 డేట్ ఖాళీగా ఉంది. ఆ రోజు గురువారం సినిమా రిలీజ్ చేస్తే వీకెండ్ తో పాటు రాఖీ కూడా కలిసొచ్చి అయిదు రోజులు సినిమాలకు కలిసొస్తుంది.

Also Read : Rana Daggubati : తిరుపతి కథతో రానా దగ్గుబాటి.. చిన్న కథ కాదు అంటూ చిన్న సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరో తెలుసా?

పుష్ప 2 పక్కకు తప్పుకోవడంతో ఇంకా ఏ పెద్ద సినిమా ఆ డేట్ ప్రకటించకపోవడంతో ఇప్పుడు చిన్న సినిమాలు అన్ని ఆ డేట్ ని టార్గెట్ చేశాయి. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆయ్’. ఈ సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య నొప్పినీడు నిర్మాణంలో అంజి కె.మ‌ణిపుత్ర‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేశారు. గోదావరి బ్యాక్ డ్రాప్ తో ఆయ్ సినిమా తెరకెక్కుతుంది.

అలాగే అదే రోజు ఆగస్టు 15న ఇంకో సినిమా కూడా రిలీజ్ డేట్ ని ప్రకటించింది. రానా దగ్గుబాటి నిర్మాతగా ’35 – ఇది చిన్నకథ కాదు’ అనే టైటిల్ తో నేడు ఓ సినిమాని ప్రకటించారు. ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా విశ్వ దేవ్, సీనియర్ నటీనటులు గౌతమి, భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో, రానా నిర్మాణంలో నంద కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ తో ఈ కథ తెరకెక్కుతుంది. మరి పుష్ప 2 తప్పుకోవడంతో ఆగస్టు 15 బరిలో ఇంకెన్ని సినిమాలు వస్తాయో చూడాలి.