Rana Daggubati : తిరుపతి కథతో రానా దగ్గుబాటి.. చిన్న కథ కాదు అంటూ చిన్న సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరో తెలుసా?

రానా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉంది.

Rana Daggubati : తిరుపతి కథతో రానా దగ్గుబాటి.. చిన్న కథ కాదు అంటూ చిన్న సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరో తెలుసా?

Rana Daggubati New Movie announced as a Producer with Tirupati Story

Updated On : June 25, 2024 / 11:27 AM IST

Rana Daggubati : రానా దగ్గుబాటి ఓ పక్కన నటుడిగా రాణిస్తూనే మరో పక్క నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మంచి కథలు, మీడియం నటీనటుల్ని పెట్టి రానా చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రానా దగ్గుబాటి మరో కొత్త సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, డీటెయిల్స్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read : Kangana Ranaut : ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు.. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

రానా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉంది. ’35 – ఇది చిన్నకథ కాదు’ అనే టైటిల్ తో సినిమాని ప్రకటించారు. ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా విశ్వ దేవ్, సీనియర్ నటీనటులు గౌతమి, భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో, రానా నిర్మాణంలో కొత్త దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ కథ తిరుపతిలో జరగనున్నట్టు, అందరి మనుషులను టచ్ చేస్తుంది అని రానా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు.

రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి తిరుపతిలో ఉండే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథతో ఒక మంచి ఎమోషనల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. హీరోగా ప్రియదర్శి ఖాతాలో ఇంకో సినిమా చేరగా నివేదా థామస్ కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రాబోతుంది.