Dhumavati Devi : నాని పారడైజ్ సినిమాలో ధూమావతి దేవి.. కాకి వాహనం.. వితంతువుల పూజలు.. అసలు ఎవరీ దేవత..?
కాసర్ల శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి కూడా పలు ఆసక్తికర వైషయాలు తెలిపారు. (Dhumavati Devi)
Dhumavati Devi
- నాని ప్యారడైజ్ సినిమా
- కాసర్ల శ్యామ్ ఇంటర్వ్యూ
- ప్యారడైజ్ సినిమాలో ధూమావతి దేవి
Dhumavati Devi : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ది పారడైజ్ సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్ తో మరింత హైప్ నెలకొంది. ఈ సినిమాలో కాకి జాతి అంటూ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా లో ఆయా షేర్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ మీడియాతో మాట్లాడారు.
కాసర్ల శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి కూడా పలు ఆసక్తికర వైషయాలు తెలిపారు. ఈ సినిమా.. హైదరాబాద్, సికింద్రాబాద్ లో 1980 ల్లో జరిగే కథ. సవారీ జాతికి చెందిన కథ. ఓ సంచార జాతి లాంటి వాళ్లకు సంబంధించిన కథ. ఆ జాతిలోంచి ఓ హీరో పుడతాడు. ఈ జాతి వాళ్ళు ధూమావతి అనే దేవతని పూజిస్తారు. సినిమాలో ఆమెకు పూజ చేసే సీన్స్ కూడా ఉంటాయి. ఆ పూజ దగ్గర ఓ పాట కూడా ఉండే అవకాశం ఉంది అని తెలిపారు.
Also Read : Pawan Kalyan Prabhas : పవన్ – ప్రభాస్ కాంబో నిజంగానే ప్లాన్ చేస్తున్నారా? OG సీక్వెలా లేదా వేరే కథా..?
దీంతో ధూమావతి దేవి ఎవరు అని వెతుకులాట మొదలుపెట్టారు. హిందూ పురాణాల ప్రకారం ధూమావతి దేవి హిందూ తాంత్రిక దేవతల సమూహం అయిన దశ మహావిద్యలలో ఒకటి. ఏడవ మహావిద్య ఈ ధూమావతి మహాదేవి. ధూమావతి అంటే భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. ఈ దేవత తెల్లచీర కట్టుకొని వితంతువుగా గుర్రం లేని రథంపై కనిపిస్తుంది. ఈమెకు కాకి వాహనంగా ఉంటుంది. ఈమె చుట్టూ కాకులు తిరుగుతుంటాయి. చేతిలో చాట ఆయుధంగా ఉంటుంది.
Dhumavati Devi
దహన సంస్కారాలు జరిగే ప్రదేశాల్లో ఈ దేవత ఉంటుంది. ధూమావతి సాధారణంగా అశుభానికి సూచిస్తారు. విశ్వ వినాశన సమయంలో ఈమె కనిపిస్తుందని అంటారు. ఈమె సమాజంలో ఎక్కడికీ వెళ్ళని స్త్రీగా, ఆకర్షణీయం కానిది, అశుభం, పేదలు, బిచ్చగాళ్ళు, కుష్టురోగులు, రోగుల రూపంలో కనిపిస్తుంది. ఎడారులు, శిథిలమైన ఇళ్ళు, పేదరికం, ఆకలి, దాహం, తగాదాలు, పిల్లల శోకం, అడవి, స్మశానాలు.. లాంటి అనాగరిక ప్రమాదకరమైన ప్రదేశాలలో నివసిస్తుంది. కొన్ని చోట్ల ధూమావతిని ఒక మాంత్రికురాలుగా కూడా వర్ణించారు. ఆమె జీవితంలోని అన్ని భయంకరమైన కష్టాలను సూచిస్తుంది. కాకి వాహనం కాబట్టి కాకి లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. శవం మీద కూర్చుంటుందని, బూడిదను ధరిస్తుందని అంటారు.

అయితే ధూమావతి తాంత్రిక దేవత కావడంతో అతీంద్రియ శక్తులను ఇచ్చేదిగా, అన్ని కష్టాల నుండి రక్షించేదిగా, అంతిమ జ్ఞానం ప్రసాదించేదిగా పురాణాల్లో వర్ణించారు. శత్రువులను ఓడించాలనుకునే వారు ఆమెని ఆరాధిస్తారు. ధూమావతి దేవిని కేవలం జంటగా లేని సభ్యులు, బ్రహ్మచారులు, వితంతువులు, ప్రపంచ పరిత్యాగిలు, తాంత్రికులు మాత్రమే పూజ చేస్తారు. వివాహం చేసుకున్న జంటలు ఈమెను పూజించరు. వారణాసిలో ఈమె ఆలయం ఉంది. దేశంలో చాలా తక్కువ ఆలయాలు ఈ దేవతకు ఉన్నాయి. కానీ కొన్ని స్మశానాల్లో తాంత్రిక ఆచారాల ద్వారా ఆమెను ఆరాధిస్తారని సమాచారం. ఈ ధూమావతి దేవిని పారడైజ్ సినిమాలో నాని, అతని సవారి జాతి పూజించే విధంగా చూపించబోతున్నారని సమాచారం.
Also Read : Allu Ayaan : మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతున్న అల్లు అయాన్.. వీడియో వైరల్..
గమనిక : ఈ ధూమావతి దేవి యొక్క సమాచారం పలు సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం నుంచి సేకరించబడినది.

