Bigg Boss Nominations : నామినేషన్స్ ఫైర్.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారంటే.. ఫ్యామిలీల గురించి చెప్పి ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..
నిన్నటి నామినేషన్స్ నేడు కొనసాగాయి. (Bigg Boss Nominations)
Bigg Boss Nominations
Bigg Boss Nominations : నిన్నటి నామినేషన్స్ నేడు కొనసాగాయి. మొదట వర్షిణి వచ్చి నరేష్ ని నామినేట్ చేసింది. మిమ్మల్ని బ్యాడ్ ఇన్ ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఆడట్లేదు అని. ఇద్దరి మధ్య బాగా వాగ్వాదం జరిగింది. నెక్స్ట్ శివని నామినేట్ చేసింది. మా బ్యాచ్ ని ఇన్ ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని విడదీయడానికి వచ్చారు అని చెప్పింది. మధ్యలో త్రిగున్, ముకేశ్ వచ్చి గొడవపడ్డారు. ముకేశ్.. రోహిత్ నువ్వు చూస్తున్నావు గా నువ్వు తొక్కుదాం అనుకున్న అతన్ని నేను తొక్కుతాను అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.
నెక్స్ట్ రామ్ ప్రసాద్ వచ్చి వర్షిణి ని నామినేట్ చేసాడు. ఆమె వీకెండ్ లో రామ్ గురించి రాసినవి అన్ని చెప్పి నామినేట్ చేసాడు. మధ్యలో బిగ్ బాస్ ఆపేయడంతో నెక్స్ట్ వీక్ మల్లి అవే పాయింట్స్ చెప్పి చేస్తాను అన్నాడు. నెక్స్ట్ నీతూ మాస్టర్ ని నామినేట్ చేసాడు. అమన్ వచ్చి.. సుధీర్ ని, వర్షిణిని నామినేట్ చేసారు.
శివ వచ్చి ముకేశ్ ని నామినేట్ చేసాడు. దేబ్జానీ వెనక శివ తిరుగుతున్నాడు అని చేసిన కామెంట్స్ గురించి మాట్లాడి క్యారెక్టర్ ని నెగిటివ్ చేసావని ఫైర్ అయ్యాడు. దీంతో ముకేశ్, వర్షిణి శివతో గొడవ పడ్డారు. బాగానే వాగ్వాదం జరిగింది. దేబ్జానీ కూడా తిట్టింది ముకేశ్ ని. నెక్స్ట్ రామ్ ప్రసాద్ ని నామినేట్ చేసాడు శివ.
Also Read : Pocket Rockkets : ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ రిలీజ్.. శ్రీలంకకు వెళ్లి మరీ గ్యాంబ్లింగ్.. భలే ఉందే..
నెక్స్ట్ దేబ్జాని వచ్చి మోస్ట్ డిస్ రెస్పెక్ట్ ఫుల్, బ్యాడ్ పర్సన్, డర్టీ మైండెడ్ , పాయిజన్ అంటూ కామెంట్స్ చేసి ముకేశ్ ని నామినేట్ చేసింది. మధ్యలో త్రిగున్ – ముకేశ్ గొడవ పడ్డారు. నెక్స్ట్ సుధీర్ సరిగ్గా ఆడట్లేదు అని నామినేట్ చేసింది.
త్రిగున్ – వర్షిణి ని నామినేట్ చేసాడు. ఫ్రెండ్ అని చెప్పి మోసం చేసినందుకు. వర్షిణి డిఫెండ్ కి మాట్లాడదాం అంటే మాట్లాడుకో అని త్రిగుణ వెళ్లి కూర్చున్నాడు. మధ్యలో శివ వచ్చి వర్షిణి తో గొడవ పడ్డారు. నెక్స్ట్ కళ్ళు తాగిన కోతి అని ముకేశ్ ని నామినేట్ చేసాడు. ఝాన్సీ ని వాడుకొని మోసం చేసి పంపించేసినందుకు నామినేట్ చేసాడు. వీకెండ్ లో నాగార్జున త్రిగున్ కి చూపించిన వీడియో గురించి కూడా మాట్లాడాడు త్రిగున్. వంశీ ఆ వీడియోలలో ఏం ఉంది అని అడగడంతో ముకేశ్, రోహిత్.. త్రిగున్ గురించి దారుణంగా మాట్లాడుకున్న వీడియోల గురించి చెప్పాడు.
నామినేషన్స్ అయ్యాక సుధీర్ తో ఆ వీడియోల గురించి త్రిగున్, వంశీ మాట్లాడారు. ఇక ఈ వారం వంశీ, ముకేశ్, అమన్, వర్షిణి , దేబ్జానీ, నీతూ, నరేష్, శివ, సుధీర్, రామ్ ప్రసాద్ లు నామినేషన్స్ లో ఉన్నారు.
నామినేషన్స్ అయ్యాక సుధీర్ – నరేష్ ముకేశ్ గురించి మాట్లాడుకున్నారు. సుధీర్ పక్కకు వెళ్లి మాట్లాడుతుండటంతో వర్షిణి – ముకేశ్ మాట్లాడుకున్నారు. తర్వాత ముకేశ్ – వర్షిణి – సుధీర్ మాట్లాడుకున్నారు. సుధీర్.. ముకేశ్, వర్షిణి ఇద్దరూ చేసింది తప్పు అని చెప్పడంతో షాక్ అయ్యారు. అలాగే వర్షిణి ముకేశ్ ని ప్రోవోక్ చేసింది అని చెప్పాడు. తమ టీమ్ సుధీర్ తమకే తప్పు అని చెప్పడంతో షాక్ అయ్యారు ఇద్దరూ. ముకేశ్ – వర్షిణి ఇద్దరూ సుధీర్ గురించి డిస్కషన్ పెట్టాడు. ఇతని కోసం ఏడ్చానా, ఇతన్ని సేవ్ చేసానా అని మాట్లాడాడు ముకేశ్.
Also Read : Yukti Thareja : గాగ్రా చోళీ డ్రెస్లో అందాలు ఆరబోస్తున్న యుక్తి తరేజా..
ఈ వారం రివార్డ్, రివెంజ్ ఆటకు స్వాగతం అని బిగ్ బాస్ ఈ వారం జరిగే వాటి గురించి తెలిపాడు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను చూపించి ఫ్యామిలీ రివార్డ్స్ అని చెప్పాడు. వచ్చే వారం ఫ్యామిలీ వీక్. కానీ అందరికి దక్కదు. ఫ్యామిలీని కలవాలి అంటే పోరాడాలి. రాబోయే ఛాలెంజ్ లలో గెలవాలి. గెలిచిన వాళ్ళకి ఫ్యామిలీని కలవడమే కాదు కెప్టెన్సీ పోటీకి కంటెండర్ వస్తుంది అని చెప్పాడు బిగ్ బాస్. అలాగే రివార్డ్ కావాలంటే ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలి. రివెంజ్ కి గురయిన సభ్యులు కెప్టెన్సీ కంటెండర్ తో పాటు ఫ్యామిలీని కలుసుకునే ఛాన్స్ కోల్పోతారు అని చెప్పాడు.
నరేష్ టాప్ 5 అని బిగ్ బాస్ కెమెరా తో కామెడీ చేసాడు. కాసేపు నరేష్, రామ్ ప్రసాద్ కాసేపు కామెడీ చేసారు టాప్ 5 గురించి. అందరూ ఈ కామెడీ ఎంజాయ్ చేస్తుంటే వర్షిణి, ముకేశ్ మాత్రం దూరంగా కూర్చున్నారు.
అనంతరం బిగ్ బాస్ మీ గురించి, ఫ్యామిలీ గురించి చెప్పండి అని కంటెస్టెంట్స్ ని అడిగాడు. ఒక్కొక్కరు తమ ఫ్యామిలీ గురించి సింపుల్ గా చెప్పారు. మొదట త్రిగున్.. తన ఫ్యామిలీ గురించి చెప్పాడు. తన తల్లి, తండ్రి గురించి, సినిమాల్లోకి వెళ్లేముందు గురించి చెప్పాడు. డబ్బులు బాగా సంపాదించినా పోయాయి అని చెప్పాడు. మళ్ళీ సంపాదించాను అని, తన పెళ్లి గురించి చెప్పాడు. నిశ్చితార్థం తర్వాత తన తల్లి చనిపోయిందని ఎమోషనల్ అయ్యాడు. పెళ్లి కాకముందే నా భార్య వాళ్ళ నాన్న తనని మా ఇంట్లో పెట్టి మమ్మల్ని చూసుకోమన్నాడు అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు.
అమన్.. మా నాన్న పంచర్ షాప్ తో మొదలుపెట్టాడు. ఇల్లు అమ్మి మా అక్క పెళ్లి కోసం అమ్మేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టాను అని చెప్పాడు.
Also Read : Rajamouli : సుకుమార్ – చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. ఓపెనింగ్ సీన్ హార్డ్ హిట్టింగ్ అంటూ..
నెక్స్ట్ నీతూ.. మా అమ్మకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అయినా పనులు చేసి మా అక్క చెల్లెల్లు ముగ్గురికి ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. హార్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా మమ్మల్ని పెంచే స్థోమత లేక మా అక్కల్ని వేరే వాళ్లకు పెంచడానికి ఇచ్చేసింది అని చెప్పింది. నాలో ఉన్న డ్యాన్స్ ఉన్న ఇంట్రెస్ట్ చూసి డ్యాన్స్ నేర్పించింది. అలా డ్యాన్స్ చేస్తూ డబ్బులు సంపాదించా. కానీ అమ్మ చనిపోయేముందు మాస్టర్ పరిచయం అయ్యాడు. మొదట లవ్ మ్యారేజ్ అని ఒప్పుకోలేదు. కానీ మాస్టర్ నా కోసం, మా అమ్మ కోసం సేవలు చేసాడు. అమ్మ వెళ్ళిపోయాక పెళ్లి, పిల్లలు అని చెప్పి ఎమోషనల్ అయింది.
వర్షిణి.. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు. మా అక్క, అన్నే అంతా. రిలేషన్ షిప్ లో పడ్డాను, బ్రేక్ అయినప్పుడు చాలా ఎఫెక్ట్ అయ్యాను. మా ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాతే ఇండస్ట్రీకి వచ్చా. మా అన్నకు ఇండస్ట్రీ రావడం ఇష్టం లేదు. గొడవలు అయ్యాయి. ఇండస్ట్రీలో చాలా షాక్స్ తగిలాయి అని తెలిపింది.
ముకేశ్.. నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు. మా అక్క బాగా చదివి జాబ్ తెచ్చుకుంది. మా నాన్నకు పక్షవాతం వచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చాను అప్పుడు మా అక్కే నిలబడింది. తన పెళ్ళికి తానే సంపాదించుకుంది. మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆపరేషన్ చేయించాం. కీమో థెరపీకి వెళ్తుంది. ఇపుడు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎలా ఉందో తెలీదు. అమ్మ ఫేస్ లో కళ లేదు. పదేళ్లుగా మా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే వాళ్ళ బావకు సారి చెప్పి మా అక్కని బాగా చూసుకోండి అని చెప్పాడు. ఇలా కంటెస్టెంట్స్ ఫ్యామిలీల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీల గురించి రేపటి ఎపిసోడ్ లో చూపిస్తారని తెలుస్తుంది.
