School Holidays: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల హడావుడి.. నవంబర్ 4, 5న స్కూల్స్ బంద్.. అధికారిక ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని పాఠశాలలు(School Holidays) ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
Ap mptc zptc elections 2026 government declares holidays for schools
School Holidays: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే, పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ వేగవంతం చేశాయి. పోలింగ్ కేంద్రాలుగా పాఠశాలలు, కళాశాలలను ఉపయోగిస్తుండటం, సిబ్బందికి కేటాయింపులు ఉన్నందున నవంబర్ 4, 5 తేదీల్లో సంబంధిత విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు(School Holidays) ప్రకటిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 5న పోలింగ్, 7న లెక్కింపు.. ఏర్పాట్లలో నిమగ్నమైన పంచాయతీరాజ్ శాఖ:
రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, అందుకు సంబంధించిన ముందస్తు సిద్ధతలకు గాను నవంబర్ 4వ తేదీని ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే నవంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది.
ఎన్నికలు జరిగే ప్రాంతాలకే సెలవుల వర్తింపు.. అధికారుల కీలక స్పష్టత:
అయితే ఈ ప్రకటించిన సెలవులు కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాలలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠశాలలకు నవంబర్ 7న కూడా సెలవు ఉంటుందని తెలిపారు. ఎన్నికలు జరగని మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా విద్యాసంస్థలు నడుస్తాయని, స్థానిక షెడ్యూల్ ఆధారంగా సెలవుల వివరాలను తెలుసుకోవాలని సూచించారు.
