Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ ని టార్గెట్ చేసిన మహేష్ ఫ్యాన్స్.. సారీ చెప్పిన హరీష్ శంకర్..
హరీష్ శంకర్ ఈ వివాదంపై స్పందించి మహేష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో ఓ లెటర్ ని పోస్ట్ చేసారు. (Harish Shankar)
Harish Shankar
- హరీష్ శంకర్ ట్వీట్ వైరల్
- మహేష్ ఫ్యాన్స్ ఫైర్
- క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్
Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. హరీష్ అప్పుడప్పుడు ఫ్యాన్స్ పెట్టే ట్వీట్స్ కి రిప్లైలు ఇస్తాడని తెలిసిందే. నిన్న రాత్రి ఓ పవన్ అభిమాని బాబ్ రికార్డ్ ని ఈ సినిమాతో లేపేయాలి అని పోస్ట్ చేయగా హరీష్ తధాస్తు అని రిప్లై ట్వీట్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే చూసుకోకుండా అవేసిన ట్వీట్ అని డిలీట్ కూడా చేసేసాడు హరీష్.
సినీ పరిశ్రమలో ఒక హీరో రికార్డులను మరొక హీరో బద్దలుకొట్టడం మాములే. ఫ్యాన్స్ కూడా అలా రికార్డులు బద్దలు కొట్టాలని ట్వీట్స్ వేసుకోవడం మాములే. కానీ కొంతమంది మహేష్ ఫ్యాన్స్ దీన్ని నెగిటివ్ గా తీసుకొని హరీష్ శంకర్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన పదాతో తిడుతూ పోస్టులు చేయడం మొదలుపెట్టారు. పవన్ సినిమాని టార్గెట్ చేసి, సినిమాకు నెగిటివిటి చేస్తామంటూ కొంతమంది మహేష్ ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు.
దీంతో హరీష్ శంకర్ ఈ వివాదంపై స్పందించి మహేష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో ఓ లెటర్ ని పోస్ట్ చేసారు.
Also Read : Allu Ayaan : మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతున్న అల్లు అయాన్.. వీడియో వైరల్..
Harish Shankar
హరీష్ శంకర్ తన లెటర్ లో.. నిన్న నేను చాలా బిజీగా ఉన్నాను. సెన్సార్ తర్వాత బోర్డు అధికారులతో సమావేశం అయ్యాను, పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించాను. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చూసుకున్నాను, పాట ప్రోమో కోసం ఫైనల్ చెక్ చేసుకున్నాను. థమన్ స్టూడియోకి వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను చూసుకున్నాను. ఈ సమయంలో జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు, సాంగ్ ప్రోమోను అభినందించిన అభిమానులకు నా రెలీలు ఇస్తున్నాను. ఆ హడావిడిలో ఒక ట్వీట్‌ను పాక్షికంగా మాత్రమే చదివి అనుకోకుండా ట్వీట్ చేశాను. నిమిషంలోపే నా టీమ్ నన్ను అప్రమత్తం చేసి ట్వీట్‌ను పూర్తిగా చదవమని చెప్పడంతో నేను వెంటనే తప్పును గ్రహించి ఆ ట్వీట్ తేసేసాను.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారిపై నాకు గౌరవం ఉంది. వారణాసి సినిమాతో ఆయన పేరుతో చాలా రికార్డులు సృష్టించబడతాయని నేను నమ్మాను. ఇది ఆయనను లేదా ఆయన అభిమానులను బాధపెట్టాలనే ఉద్దేశం లేకుండా అనుకోకుండా చేసిన తప్పు. పోకిరి గురించి ఆయన పుట్టినరోజున నేను పోస్ట్ చేసిన ట్వీట్లను కూడా మీరు చూసుకోవచ్చు. ఆయన పట్ల నాకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీసి ఉంటే నా హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే, దానికి అన్ని హీరోలు, ఫ్యామిలీలు, అభిమానుల ప్రేమ, మద్దతు అవసరం. నా సినిమా కేవలం 10 రోజుల్లో విడుదలవుతున్నప్పుడు అలాంటి వాటిని పోస్ట్ చేయకూడదు అనే జ్ఞానం నాకు ఉంది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు నా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించి మా సినిమాకు మద్దతు ఇవ్వండి అని తెలిపారు.
Also Read : Jr NTR Mother : బిఆర్ఎస్ నేతను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని సపోర్ట్ చేస్తుంటే మహేష్ ఫ్యాన్స్ మాత్రం టార్గెట్ చేసారు. మరి ఈ వివాదం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.
