IPL 2023, PBKS vs GT: గిల్ అర్ధ‌శత‌కం.. గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం

మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

IPL 2023, PBKS vs GT: మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (67;49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా, వృద్ధిమాన్ సాహా(30; 19 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, ర‌బాడా, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ క‌ర్రాన్‌ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో మాథ్యూ షార్ట్ (36), జితేష్ శ‌ర్మ (25) ప‌ర్వాలేద‌నిపించ‌గా.. ఆఖ‌ర్లో షారుక్ ఖాన్ వేగంగా (9 బంతుల్లో 22 ప‌రుగులు) ఆడ‌డంతో పంజాబ్ 150 ప‌రుగుల మార్క్‌ను దాటింది. గుజ‌రాత్ బౌల్లర్ల‌లో మోహిత్ శ‌ర్మ రెండు వికెట్లు తీయ‌గా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు