Sourav Ganguly : టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి.. గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కాస్త తెలివిని వాడండి

హెడ్‌కోచ్ ప్ర‌క్రియ‌పై భార‌త మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Ganguly : టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో ముగుస్తుంది. కొత్త కోచ్ జూలై 1 నుంచి బాధ్య‌త‌లు చేప‌ట్టాల్సి ఉంది. అయితే.. ద్ర‌విడ్ వార‌సుడిగా ఎవ‌రు వ‌స్తారు అనే ఆస‌క్తి అందరిలో నెల‌కొంది. ఇప్ప‌టికే బీసీసీఐ హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. కాగా.. గ‌త సోమ‌వారంతోనే ద‌ర‌ఖాస్తు గ‌డువు కూడా ముగిసింది. హెడ్ కోచ్ ప‌ద‌వికి దాదాపు 3వేల‌కు పైగా అప్లిక్లేష‌న్లు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

హెడ్‌కోచ్‌గా టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, కేకేఆర్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ నియామ‌కం అయిన‌ట్లు, త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో హెడ్‌కోచ్ ప్ర‌క్రియ‌పై భార‌త మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కోచ్ ప‌ద‌వి కోసం ఎంపిక చేసేట‌ప్పుడు కాస్త తెలివిని ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు.

Virat Kohli : అవును ఇది నిజం.. ఆ రోజు ఎంతో భ‌య‌ప‌డ్డా : విరాట్ కోహ్లి

ఓ ఆట‌గాడి జీవితంలో కోచ్ ప‌ద‌వి అత్యంత కీల‌క‌మైన‌ది గంగూలీ చెప్పాడు. హెడ్‌ కోచ్ అనేవారు మార్గ‌ద‌ర్శిగా, కనికరం లేని శిక్షణతో ప్లేయ‌ర్ల‌ను అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుందన్నాడు. వ్య‌క్తిత్వ ప‌రంగానూ ఆట‌గాళ్ల‌ను తీర్చిదిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. కోచ్ పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు కాస్త తెలివిని ప్రదర్శించాలి అని గంగూలీ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

కాగా.. కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు ప్రక్రియ గ‌త సోమ‌వారమే ముగిసిన‌ప్ప‌టికీ ఎవ‌రు అప్లై చేసుకున్నారు అన్న విష‌యాలు ఇంకా తెలియ‌రాలేదు. కోచ్ ఎంపిక ప్ర‌క్రియ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Gautam Gambhir : గంభీర్‌ను సునీల్ న‌రైన్ అడిగిన మొద‌టి ప్ర‌శ్న‌.. నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావొచ్చా..? గౌతీ ఆన్స‌ర్..

ట్రెండింగ్ వార్తలు