Virat Kohli : అవును ఇది నిజం.. ఆ రోజు ఎంతో భ‌య‌ప‌డ్డా : విరాట్ కోహ్లి

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Virat Kohli : అవును ఇది నిజం.. ఆ రోజు ఎంతో భ‌య‌ప‌డ్డా : విరాట్ కోహ్లి

Kohli Recalls Feelings Before World Cup Debut Match In 2011

Virat Kohli World Cup Debut : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డు గ్రౌండ్‌లో అడుగుపెట్టాడంటే ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకుపుడుతుంది. త‌న బ్యాటింగ్‌తోనే కాకుండా త‌న అగ్రెష‌న్‌తో కూడా విరాట్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఎవ‌రైనా త‌న‌ను విమ‌ర్శిస్తే త‌న బ్యాటింగ్‌తోనే స‌మాధానం చెబుతూ ఉంటాడు. ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్ సీజ‌న్‌లోనూ ప‌రుగుల వ‌ర‌ద పారించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ క్ర‌మంలో ఇదే ఫామ్‌ను రానున్న టీ20 ప్ర‌పంచ‌కప్‌లోనూ కొన‌సాగించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో ఓ ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ.. మొద‌టి సారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడిన రోజుల‌ను గుర్తు చేసుకున్నాడు. మెగాటోర్నీల్లో 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విరాట్ కోహ్లికి మొద‌టిది. ఆ టోర్నీలో బంగ్లాదేశ్‌తో కోహ్లి తొలి మ్యాచ్ ఆడాడు. ఆ స‌మ‌యంలో తాను ఎంతో ఆందోళ‌న‌కు గురైన‌ట్లు చెప్పాడు.

Gautam Gambhir : గంభీర్‌ను సునీల్ న‌రైన్ అడిగిన మొద‌టి ప్ర‌శ్న‌.. నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావొచ్చా..? గౌతీ ఆన్స‌ర్..

2011లో ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో నా మొద‌టి ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ ఆడాను. వాస్త‌వానికి ఆ స‌మ‌యంలో ఎంతో ఆందోళ‌న‌కు లోనైయ్యాను. అది నిజం. నేను అబ‌ద్దాలు చెప్ప‌డం లేదు. అని కోహ్లి అన్నాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడ‌డం వేర‌ని, ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌ట్టు ప్రాతినిధ్యం వ‌హించ‌డం వేర‌ని చెప్పుకొచ్చాడు. ఆ స‌మ‌యంలో టీమ్‌లో ఉన్న ఆట‌గాళ్ల‌ల‌లో తానే అంద‌రి క‌న్నా చాలా చిన్న‌వాడిన‌ని గుర్తు చేసుకున్నాడు.

గొప్ప ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆడే అవ‌కాశం రావ‌డం ఎంతో అద్భుతం అని, మ్యాచ్ ముందు రోజు కూడా ఆందోళ‌న‌కు గురైన‌ట్లు తెలిపాడు. అలాంటి ప‌రిస్థితుల్లో నాణ్య‌మైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శిస్తే జ‌ట్టుకు చాలా ఉప‌యోగంగా ఉంటుంది. ఇందుకోసం మాన‌సికంగా, శారీర‌కంగా సిద్ధం అయ్యాను. ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేసేందుకు ఆ నెర్వ‌స్‌నెస్ సాయ ప‌డింద‌ని అనుకుంటున్న‌ట్లు కోహ్లి తెలిపాడు.

Rohit Sharma : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..

కాగా.. ఆ మ్యాచ్‌లో కోహ్లి 83 బంతుల్లోనే 100 ప‌రుగులు చేయ‌డం విశేషం.