Gautam Gambhir : గంభీర్‌ను సునీల్ న‌రైన్ అడిగిన మొద‌టి ప్ర‌శ్న‌.. నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావొచ్చా..? గౌతీ ఆన్స‌ర్..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఛాంపియ‌న్‌గా నిలిచింది.

Gautam Gambhir : గంభీర్‌ను సునీల్ న‌రైన్ అడిగిన మొద‌టి ప్ర‌శ్న‌.. నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావొచ్చా..? గౌతీ ఆన్స‌ర్..

Gautam Gambhir Reveals Sunil Narine First Words

Gautam Gambhir – Sunil Narine : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఆ జ‌ట్టు టైటిల్‌ను గెల‌వ‌డంలో మెంటార్ గౌత‌మ్ గంభీర్ పాత్ర ఎంతో ఉంది. అత‌డు సునీల్ న‌రైన్‌ను ఓపెన‌ర్‌గా పంపడం కేకేఆర్ చాలా బాగా ఫ్ల‌స్సైంది. ఎప్పుడూ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించే న‌రైన్ ఈ సారి బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. 488 పరుగులు చేయడంతో పాటు 17 వికెట్లు పడగొట్టి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా నిలిచాడు. దీంతో నరైన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కెప్టెన్‌గా కేకేఆర్ కు రెండు ట్రోఫీలు అందించిన గంభీర్ మెంటార్ గా మ‌రోసారి ఛాంపియ‌న్‌గా నిలిపాడు. ఈ క్ర‌మంలో అత‌డు వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో బిజీగా ఉన్నాడు. స్పోర్ట్స్కీ డాతో గంభీర్ మాట్లాడుతూ.. సునీల్ న‌రైన్‌కు త‌న‌కు మ‌ధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు. త‌న‌లాగే న‌రైన్ సైతం ఎవ్వ‌రితోనూ ఎక్కువ‌గా మాట్లాడ‌డ‌ని, ఇద్ద‌రం కూడా మైదానంలో ఎలాంటి భావాల‌ను వ్య‌క్త ప‌ర‌చ‌మ‌ని చెప్పుకొచ్చాడు.

Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ రూమ‌ర్ల మ‌ధ్య.. త‌న త‌దుప‌రి ల‌క్ష్యం పై స్ప‌ష్ట‌త నిచ్చిన గౌత‌మ్ గంభీర్‌..!

సునీల్ న‌రైన్ 2012లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. అప్ప‌టి నుంచి కూడా అత‌డు కోల్‌క‌తాతోనే ఉంటున్నాడు. కాగా.. అరంగ్రేట సీజ‌న్‌లో జైపూర్‌లో ప్రాక్టీస్ ముగించుకుని వ‌చ్చిన‌ప్పుడు న‌రైన్‌ను లంచ్ ర‌మ్మ‌ని చెప్ప‌గానే అత‌డు బాగా సిగ్గుప‌డ్డాడ‌ని గంభీర్ తెలిపాడు. భోజ‌నం స‌మ‌యంలో అత‌డు ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని తెలిపాడు. ఆఖ‌రికి త‌న‌ను ఒకే ఒక్క ప్ర‌శ్న అడిగాడ‌ని చెప్పాడు.

త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావ‌చ్చా అని సునీల్ న‌రైన్ త‌న‌ను అడిగిన‌ట్లు గంభీర్ తెలిపాడు. అయితే.. తాను ఏం స‌మాధానం చెప్పాడ‌నే విష‌యాన్ని మాత్రం గంభీర్ చెప్ప‌లేదు. న‌రైన్ త‌న ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో చాలా మౌనంగా ఉండేవాడు. అయితే.. ఇప్పుడు మాత్రం అత‌డితో మ‌నం ఏమైనా మాట్లాడ‌వ‌చ్చు. అత‌డిని తాను స్నేహితుడిగా, స‌హ‌చ‌రుడిగా చూడ‌న‌ని గంభీర్ తెలిపాడు.

Rohit Sharma : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..

ఓ సోద‌రుడిగా న‌రైన్ ను చూస్తాన‌ని గంభీర్ చెప్పాడు. నాకు ఏ స‌మ‌స్య ఉన్నా, లేదా త‌న‌కు ఏ స‌మ‌స్య ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటాము. అలాంటి బంధాన్ని తాము నిర్మించుకున్న‌ట్లు గంభీర్ తెలిపాడు.