Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ రూమ‌ర్ల మ‌ధ్య.. త‌న త‌దుప‌రి ల‌క్ష్యం పై స్ప‌ష్ట‌త నిచ్చిన గౌత‌మ్ గంభీర్‌..!

ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన త‌రువాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ రూమ‌ర్ల మ‌ధ్య.. త‌న త‌దుప‌రి ల‌క్ష్యం పై స్ప‌ష్ట‌త నిచ్చిన గౌత‌మ్ గంభీర్‌..!

PIC Credit : KKR

Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వికాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో ముగుస్తోంది. అత‌డి వార‌సుడిగా ఎవ‌రు వ‌స్తారు అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ హెడ్ కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఐపీఎల్ ఫైన‌ల్ త‌రువాత గౌత‌మ్ గంభీర్‌తో బీసీసీఐ కార్యద‌ర్శి జైషా సుదీర్ఘంగా మాట్లాడ‌డం ఈ వ్యాఖ్య‌లకు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.

అయితే.. ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన త‌రువాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. మూడోసారి క‌ప్పును గెలవ‌డంతో డ్రెస్సింగ్ రూమ్ మొత్తం సంతోషంతో నిండిపోయింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ కంటే మ‌నం ఇంకా రెండు టైటిళ్లు వెనుక‌బ‌డి ఉన్న‌ట్లు గంభీర్ అన్నాడు. ఈ రోజుకు నేను సంతృప్తి చెందాను. అయితే.. ఇంకా ఆక‌లిగా ఉంది. ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా కేకేఆర్ నిల‌వాలంటే ఇంకో మూడు టైటిళ్లు గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పాడు.

Rohit Sharma : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..

అయితే.. అది అంత సుల‌భం కాద‌ని, ఇందుకోసం ఎంతో క‌ష్ట‌ప‌డాల‌ని సూచించాడు. త‌న త‌దుప‌రి మిష‌న్ కేకేఆర్‌ను అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా నిల‌ప‌డ‌మేన‌ని అన్నాడు. దాన్ని సాధిస్తే అంత‌కంటే గొప్ప అనుభూతి మరొక‌టి త‌న‌కు ఉండ‌ద‌ని చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే అత‌డు కేకేఆర్‌తో ప్ర‌యాణం కొన‌సాగించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

కాగా.. భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు స‌మయం ముగిసింది. క్రిక్‌బ‌జ్ నివేదిక ప్ర‌కారం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియ‌మించ‌డం పూరైంది. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న అతి త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు తెలిపింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓన‌ర్ల‌లో బీసీసీఐ ఉన్న‌తాధికారుల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న వ్య‌క్తి ఈ విష‌యాల‌ను తెలిపిన‌ట్లు తెలియ‌జేసింది.

MS Dhoni : టీమ్ఇండియా కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ధోని అర్హుడు కాదా? ఎందుకంటే?

మ‌రీ గంభీర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడోన‌ని అంద‌రూ ఆస‌క్తి గా ఎదురుచూస్తున్నారు.