Rohit Sharma Sprint Towards Car To Avoid Getting Wet In New York Rain
Rohit sharma – Rahul Dravid : అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడింది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ పొట్టి ప్రపంచకప్ భారత కాలమానం ప్రకారం జూన్ 2న ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత జట్టు అమెరికాలోని న్యూయార్క్‌కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగిలిన ఆటగాళ్లు నెట్స్‌లో చమటోడుస్తున్నారు. ఈ సారి ఎలాగైనా భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ, ద్రవిడ్‌లు న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. షాపింగ్‌కు వెళ్లిన వీరిద్దరు భారీ వర్షం కారణంగా చిక్కుకుపోయారు. దీంతో వారిద్దరు రోడ్డు పక్కన ఉన్న ఓ షాపులో ఉండిపోయారు.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు దిమ్మదిరిగే షాక్..
ఇంతలో అక్కడకు ఓ అభిమాని వచ్చాడు. ఫోటో కావాలని రోహిత్ శర్మను అడిగాడు. ఇప్పుడు వద్దు.. బయట భారీ వర్షం పడుతోంది అంటూ హిట్‌మ్యాన్ సమాధానం ఇచ్చాడు. అనంతరం కారును తీసుకురావాలని రోహిత్ డ్రైవర్‌కు సైగ చేశాడు. వర్షం పడుతున్నప్పటికీ కూడా రోహిత్, ద్రవిడ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ కారు వద్దకు వెళ్లారు. కాగా.. రోహిత్‌తో ఫోటో దిగాలని భావించిన అభిమానికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు జూన్ 1న బంగ్లాదేశ్‌తో సన్నాహక మ్యాచ్‌ను ఆడనుంది. ఇక పొట్టి ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జూన్ 5న భారత్ తలపడనుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 9న జరగనుంది.
Rohit Sharma : టీ20 ప్రపంచకప్‌కు ముందు.. రోహిత్ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు..
Team India spotted in New York. Wait for Rohit Sharma’s sprint. ? pic.twitter.com/QlfPlSSLAW
— Vipin Tiwari (@Vipintiwari952_) May 29, 2024