T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పాకిస్తాన్‌కు దిమ్మ‌దిరిగే షాక్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పాకిస్తాన్ జ‌ట్టుకు దిమ్మ‌దిరిగే షాక్ త‌గిలింది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పాకిస్తాన్‌కు దిమ్మ‌దిరిగే షాక్‌..

England Beat Pakistan By 7 Wickets in 4th T20 and win t20 series

T20 World Cup 2024 – Pakistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పాకిస్తాన్ జ‌ట్టుకు దిమ్మ‌దిరిగే షాక్ త‌గిలింది. ఐర్లాండ్ చేతిలో ఓ టీ20 మ్యాచ్‌లో ఓడి తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన పాకిస్తాన్ ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌ను కోల్పోయింది. మొద‌టి, మూడో టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. మిగిలిన రెండు మ్యాచుల్లో ప‌రాజ‌యాలు చ‌వి చూసింది. ఫ‌లితంగా 2-0 తేడాతో ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

గురువారం జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ‌వాజా (21 బంతుల్లో 38), బాబ‌ర్ ఆజాం (22 బంతుల్లో 36) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్‌, మార్క్‌వుడ్‌, లియామ్ లివింగ్ స్టోన్‌లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Sourav Ganguly : టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి.. గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కాస్త తెలివిని వాడండి

అనంత‌రం ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ 15.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్లు ఫిల్ సాల్ట్ (24 బంతుల్లో 45), జోస్ బ‌ట్ల‌ర్ (21 బంతుల్లో 39) లు దంచికొట్టారు. విల్ జాక్స్ (18 బంతుల్లో 20) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా జానీ బెయిర్‌స్టో (16 బంతుల్లో 28 నాటౌట్‌), హ్యారీ బ్రూక్ (14 బంతుల్లో 17 నాటౌట్‌) మిగిలిన లాంఛ‌నాన్ని పూర్తి చేశారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌కు మూడు వికెట్లు తీయ‌గా మిగిలిన బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు.

భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీలో బాబ‌ర్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ బ‌రిలోకి దిగ‌నుంది. మొత్తం 20 జ‌ట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూపు ఏలో పాకిస్తాన్ ఉంది. పాక్‌తో పాటు భార‌త్‌, అమెరికా, ఐర్లాండ్‌, కెన‌డాలు ఉన్నాయి. పాకిస్తాన్ త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 6న అమెరికాతో ఆడ‌నుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే భార‌త్, పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

Gautam Gambhir : గంభీర్‌ను సునీల్ న‌రైన్ అడిగిన మొద‌టి ప్ర‌శ్న‌.. నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావొచ్చా..? గౌతీ ఆన్స‌ర్..