TATA IPL 2024 : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 62 కోట్లకుపైగా వ్యూస్‌తో జియోసినిమా సరికొత్త రికార్డు..!

TATA IPL 2024 : ఐపీఎల్ ఆరంభం తర్వాత జియోసినిమా వ్యూస్ 38శాతానికి చేరింది. తద్వారా జియోసినిమా 62 కోట్ల కన్నా ఎక్కువ వ్యూస్‌‌తో ఐపీఎల్ 2024ని ముగించింది.

TATA IPL 2024 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు చెందిన జియోసినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌లో అత్యధిక రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. దాదాపు 2600 కోట్ల వ్యూస్‌తో ముగించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో గత ఏడాది ఐపీఎల్ క్యాంపెయిన్‌తో పోలిస్తే.. ఈ ఏడాదిలో 53శాతం వృద్ధిని జియోసినిమా సాధించింది.

Read Also : Moto G04s Launch : మోటో G04s ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?

ఐపీఎల్ టోర్నమెంట్ అధికారిక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ 35వేల కోట్ల నిమిషాల వాచ్-టైమ్ నమోదు చేసింది. ఐపీఎల్ ఆరంభం తర్వాత జియోసినిమా వ్యూస్ 38శాతానికి చేరింది. తద్వారా జియోసినిమా 62 కోట్ల కన్నా ఎక్కువ వ్యూస్‌‌తో ఐపీఎల్ 2024ని ముగించింది. జియోసినిమా బ్రాండ్ స్పాట్‌లైట్ ప్లాట్‌ఫారమ్ ఆరు ప్రముఖ యూజర్ బ్రాండ్‌ల సాయంతో ప్రారంభ మ్యాచ్‌కు లైవ్ స్ట్రీమింగ్ అందించింది. అందులో డ్రీమ్11, థమ్స్ అప్, పార్లే ప్రొడక్టులు, బ్రిటానియా, దల్మియా సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి.

ఐపీఎల్ సీజన్ ఫస్ట్ డే.. 11.3 కోట్ల వ్యూస్‌తో రికార్డు :
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన తొలి మ్యాచ్ ప్రారంభంలో ఆరు ఓవర్లలోనే ఈ కంపెనీలు తమ ఐపీఎల్ క్యాంపెయిన్ ప్రారంభించాయి. బ్రాండ్ స్పాట్‌లైట్.. సీజన్ ముగిసే సమయానికి జియోసినిమా 28 మంది స్పాన్సర్‌లను 1400 కన్నా ఎక్కువ అడ్వటైజర్లను పొందింది. ఐపీఎల్ 2024 మొదటి రోజున జియోసినిమా 11.3 కోట్ల మంది వీక్షకులతో రికార్డ్ స్థాయిలో సీజన్‌ను ప్రారంభించింది. ఐపీఎల్ 2023 ప్రారంభ రోజు మ్యాచ్ నుంచి 51శాతానికి పెరిగింది. తద్వారా అది 59 కోట్ల కన్నా ఎక్కువ అనే చెప్పవచ్చు.

మార్చి 22న సీఎస్‌కే, బెంగళూరు మ్యాచ్‌డే సందర్భంగా ప్లాట్‌ఫారమ్‌పై వ్యూస్ 660 కోట్ల నిమిషాల వాచ్ టైమ్ కనిపించింది. అందులో 12 లాంగ్వేజీ ఫీడ్‌లు, 4K వ్యూ, మల్టీ-క్యామ్ వ్యూస్,స్టేడియం వంటి ఎక్స్‌పీరియన్స్ అందించింది. తద్వారా జియో సినిమా వీడియో క్వాలిటీని కూడా భారీగా పెంచింది.

టీవీ ప్రేక్షకులు AR/VR, 360-డిగ్రీల వ్యూతో గత సీజన్‌లో 60 నిమిషాలు వీక్షించగా.. ఈ ఏడాదిలో అంతకన్నా ఎక్కువ సమయం గడిపిన సగటు సమయం 75 నిమిషాలకు చేరుకుందని జియోసినిమా అధికారిక ప్రకటనలో పేర్కొంది. మే 26న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ముచ్చటగా మూడో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Read Also : Nothing Phone 2a Special Edition : నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ ఇదిగో.. కలర్ ఫుల్ డిజైన్ అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు