Tech Tips in Telugu : గూగుల్ పే, పోన్‌పే, పేటీఎంతో UPI పేమెంట్స్ చేస్తున్నారా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

Tech Tips in Telugu : యూపీఐ పేమెంట్ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, పోన్‌పే, పేటీఎంతో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ టెక్ టిప్స్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Tech Tips in Telugu for UPI Payments : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఈసారి యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు తప్పక కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ పేమెంట్స్ ద్వారా పేమెంట్లు చేసే సమయంలో ఎలాంటి అవంతరాలు లేకుండా జాగ్రత్త పడాలి. యూపీఐ ద్వారా పేమెంట్లు ఇతర ఆన్‌లైన్ పేమెంట్ విధానం కన్నా వేగంగా ఉంటాయి. మల్టీ బ్యాంకులన్నీ ఈ యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లలో ఇంటిగ్రేట్ అయ్యాయి. అయితే, ఆన్‌లైన్ లావాదేవీలు సర్వసాధారణం కావడంతో ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి.

స్కామర్లు, సైబర్ మోసగాళ్లు అమాయక వినియోగదారులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. వినియోగదారుల డబ్బును దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త మార్గాలను ఎంచుకుంటారు. యూపీఐ పేమెంట్లు చేసే సమయంలో సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ UPI పేమెంట్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం..

సేఫ్ యూపీఐ యాప్‌ని ఉపయోగించాలి :
అనేక విభిన్న UPI యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పే, పోన్‌పే, పేటీఎం వంటి UPI యాప్‌లన్నింటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల సపోర్టు అందిస్తాయి. మీరు మీ డబ్బు సురక్షితంగా ఎవరికైనా పంపుకోవచ్చు. ఇతరులు కూడా మీకు పంపవచ్చు.

మీ యూపీఐ పిన్‌ను సేఫ్‌గా ఉంచండి :
మీ యూపీఐ పిన్ (UPI PIN) మీ నగదుకు చాలా కీలకం. అందుకే పిన్ ఎవరికి షేర్ చేయరాదు. చాలా సేఫ్‌గా ఉంచడం ముఖ్యం. ఏదైనా మాల్‌వేర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీ పిన్ రిజిస్టర్ చేయవద్దు. మీరు మీ పిన్‌ని కూడా క్రమం తప్పకుండా మార్చుతుండాలి.

Read Also : MG Comet EV Bookings : ఎంజీ కామెట్ మినీ ఈవీ కార్ల బుకింగ్ మొదలైందోచ్.. కేవలం రూ.11వేలకే బుకింగ్ చేసుకోండి.. లిమిటెడ్ ఆఫర్..!

పేమెంట్ చేసే ముందు రిసీవర్ వివరాలను ధృవీకరించాలి :
యూపీఐ ద్వారా పేమెంట్లు చేయడానికి ముందు, మీరు రిసీవర్ వివరాలను జాగ్రత్తగా ధృవీకరించాలి. ఇందులో రిసీవర్ పేరు, UPI ID, మొబైల్ నంబర్ ఉంటాయి. మీరు మీ UPI యాప్‌లోని ‘వెరిఫై పేమెంట్ అడ్రస్’ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా రిసీవర్ ఐడెంటిటీని కూడా ధృవీకరించవచ్చు.

Tech Tips in Telugu : If you make UPI payments through GPay, PhonePe, Paytm keep these 5 safety tips

ఫిషింగ్ స్కామ్‌ల పట్ల జాగ్రత్త :
ఫిషింగ్ స్కామ్‌లు అనేది ఒక రకమైన చీటింగ్.. స్కామర్‌లు మీ UPI పిన్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారు. ఫిషింగ్ ఇమెయిల్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లను గుర్తు తెలియని నెంబర్ల నుంచి పంపుతుంటారు. మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ వంటి వచ్చినట్లుగా కనిపిస్తాయి. వాస్తవానికి స్కామర్లు ఇలా ఫేక్ మెసేజ్‌లను పంపుతుంటారు. మీకు అనుమానాస్పద ఇమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్ వచ్చినట్లయితే, ఏదైనా లింక్‌లపై క్లిక్ చేయవద్దు లేదా ఏవైనా యాడ్ డాక్యుమెంట్లను ఓపెన్ చేయొద్దు. అందుకు బదులుగా, ఆ మెసేజ్ వెరిఫై చేయడానికి నేరుగా కంపెనీని సంప్రదించండి.

మీ డివైజ్ సేఫ్‌గా ఉందా? :
మీ ఫోన్ కూడా హ్యాకర్లకు టార్గెట్ అవుతుందని గమనించాలి. సెక్యూరిటీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను లేటెస్ట్‌గా ఉంచడం ద్వారా మీ డివైజ్ సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ డివైజ్ లాక్ చేసేందుకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ లేదా పిన్‌ని కూడా వినియోగించాలి. అదనంగా.. మీ UPI పేమెంట్లను ప్రొటెక్ట్ చేసేందుకు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. మీ UPI యాప్‌కి లాగిన్ చేసేందుకు ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ మెథడ్ ఉపయోగించండి.

మీ యూపీఐ యాప్ కోసం టూ-ప్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA)ని ప్రారంభించండి. మీరు పేమెంట్ చేసినప్పుడు మీ UPI పిన్‌తో పాటు మీ ఫోన్ నుంచి కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా అడ్వాన్సడ్ సెక్యూరిటీని పొందవచ్చు. ఆన్‌లైన్‌లో ఏ డేటాను షేర్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా లేదా ఇతర పబ్లిక్ ఫోరమ్‌లలో మీ UPI ID లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎప్పుడూ షేర్ చేయవద్దు. మీ వ్యక్తిగత సమాచారం కోసం ఏవైనా అవాంఛనీయ అభ్యర్థనలను తిరస్కరించండి. మీ యూపీఐ పిన్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ అడుగుతూ ఎవరి నుంచి ఫోన్ కాల్ లేదా ఈ-మెయిల్‌ వచ్చినా వెంటనే డిలీట్ చేయండి.

Read Also : Nubia Z60 Fold Specifications : భారీ బ్యాటరీతో నుబియా ఫస్ట్ Z60 ఫోల్డబుల్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. వచ్చేది ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు