Netflix Free Content : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫ్రీగా కంటెంట్ చూడొచ్చు.. యాడ్స్‌ను భరించాల్సిందే..!

Netflix Free Content : భారతీయ నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఫ్రీ కంటెంట్‌కి యాక్సెస్ పొందడానికి డబ్బు అధికంగా ఖర్చు చేయనవసరం లేదు. యాడ్స్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా కంటెంట్ ఉచితంగా చూడవచ్చు.

Netflix Free Content : ప్రపంచ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వ్యాపార వ్యూహంలో భాగంగా కొత్త ప్రణాళికలతో వస్తోంది. తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫ్రీ కంటెంట్ ప్లాన్లతో ముందుకు రాబోతోంది. ప్రత్యేకించి ఎంపిక చేసిన మార్కెట్‌లలో ఫ్రీ, యాడ్ సపోర్టెడ్ గల రేంజ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రాబోయే రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా వీక్షించవచ్చు. ఈ కొత్త రేంజ్ ప్రధానంగా యూరప్, ఆసియాలోని ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవచ్చని కంపెనీ ప్లాన్‌ల గురించి తెలిసిన వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌కి తెలిపాయి.

Read Also : Airtel Free Netflix Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. 84 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఇంతకీ, ఈ ఫ్రీ కంటెంట్ ప్లాన్ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ, కంపెనీ ఇంకా యాడ్స్‌తో ఫ్రీ ప్లాన్‌ను ప్రవేశపెట్టలేదు. ఈ దేశానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేగానీ భారత మార్కెట్లోకి వస్తే, నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌కి యాక్సెస్ పొందడానికి వినియోగదారులు డబ్బు అధికంగా ఖర్చు చేయనవసరం లేదు. యాడ్స్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా కంటెంట్ ఉచితంగా చూడవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ ప్రీ కంటెంట్ అందించే ప్లాన్ ప్రాథమిక దశలో ఉందని నివేదిక పేర్కొంది. కంపెనీ గతంలో కెన్యాలో ఫ్రీ సర్వీసును టెస్టింగ్ చేసింది. లిమిట్ ఆప్షన్ కంటెంట్‌ను అందిస్తోంది. ఆ తర్వాత ఆ ప్రీ కంటెంట్ ఆప్షన్ నిలిపివేసింది. ప్రతిపాదిత ఫ్రీ రేంజ్ ఇదే మోడల్ అనుసరించి క్యూరేటెడ్, లిమిటెడ్ లైబ్రరీని అందిస్తుంది. అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదులుగా జపాన్, జర్మనీ వంటి మార్కెట్‌లపై నెట్‌ఫ్లిక్స్ దృష్టిసారిస్తుంది.

ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్‌కు పోటీగా :
నెట్‌ఫ్లిక్స్ పెరుగుతున్న పోటీకి తగినట్టుగా ఈ మార్పు చేయాలని యోచిస్తోంది. ఇటీవలి ఏళ్లలో డిస్పీ ప్లస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హెచ్‌బీఓ మ్యాక్స్ వంటి పోటీదారుల నుంచి సవాళ్లను ఎదుర్కొంది. ఈ పోటీవాతవరణాన్ని అధిగమించేందుకు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్, మల్టీ సబ్‌స్క్రిప్షన్ ధరల పెంపుపై కఠినమైన చర్యలతో సహా అనేక మార్పులను అమలు చేసింది. 2022లో, బడ్జెట్ కస్టమర్‌లను ఆకర్షించడానికి యాడ్స్ రెవిన్యూ పొందేందుకు యాడ్ సపోర్టెడ్ ఉన్న రేంజ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

కొన్ని పాపులర్ మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల పెరుగుదల ప్రధానంగా ఆకర్షణగా మారింది. ప్రీ యాడ్ సపోర్టు గల ప్లాన్‌తో యాడ్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూనే సబ్ స్ర్కిప్షన్ కోసం చెల్లించేందుకు సంకోచించే వీక్షకులను సైతం ఆకర్షించే అవకాశం ఉంది. అయినప్పటికీ, కంపెనీ ఈ ఫ్రీ ఆప్షన్ ముందుగా అమెరికాలో ప్రారంభించే ప్రణాళికలేమి లేవు.

నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫ్రీ కంటెంట్‌తో ఈ ప్లాన్ లాంచ్ అయితే భారతీ యూజర్లలో చాలా మందిని ఆకర్షించే అవకాశం ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫారమ్‌లు యూజర్లకు ఉచితంగా కంటెంట్‌ను అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారతదేశంలో సాధ్యమైనంత తక్కువ ధరలకు ప్లాన్‌లను అందిస్తోంది. ప్రైమరీ మొబైల్ ప్లాన్ భారత్‌లో రూ. 149 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ ధర రూ. 649 వరకు ఉంటుంది.

Read Also : New British Motorcycle : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. భారత్‌కు కొత్త బ్రిటీష్ బుల్లెట్ ‘బీఎస్ఏ గోల్డ్‌స్టార్’ బైక్ వస్తోంది..

ట్రెండింగ్ వార్తలు