Omicron In India : భారత్‌లో మూడవ ఒమిక్రాన్‌ కేసు నమోదు..

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కూడా గుబులు పుట్టిస్తోంది. తాజాగా భారత్‌లో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది.

3rd omicron variant case found in gujarat : దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ జెట్ వేగంతో ఇప్పటికే 38 దేశాల్లో వ్యాపించిపోయింది. అలాగే భారత్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే భారత్ లో రెండు ‘ఒమిక్రాన్’వేరియంట్ కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు కూడా నమోదు అయ్యింది. గుజరాత్ లోని జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు నిపుణులు. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసులు మూడుకు చేరాయి. దీంతో భారత్ కు కూడా ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ బాధితుడు మిస్ అయి గుబులు పెడుతున్న క్రమంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read more : Taiwan keel-Laying : చైనాను ధిక్కరించి..సొంతంగా సబ్‌మెరైన్లు తయారు చేసుకుంటున్న తైవాన్..జీర్ణించుకోలేకపోతున్న చైనా

ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా.. తాజాగా భారత్ మూడవ ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. సదరు వ్యక్తి రెండు రోజుల క్రితం జింబాంబ్వే నుంచి జామ్‌నగర్‌కు రాగా.. విమానాశ్రయం వద్ద అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు రావటంతో సదరు వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలపై దృష్టి పెట్టారు.

Read more : 6 students murder case : విద్యార్థులను కొట్టి చంపిన కేసు..13 మందికి ఉరిశిక్ష..19 మందికి జీవిత ఖైదు

ఇదిలా ఉంటే విదేశాలనుంచి భారత్‌లో దిగిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం ఇప్పుడు సమస్యగా మారింది. వారి అడ్రస్ లు తప్పుగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వారు ఇచ్చిన అడ్రస్ లో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు