Harom Hara : వాయిదా ప‌డిన సుధీర్ బాబు సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’.

Harom Hara release date : నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సెహరి’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 1980’s బ్యాక్‌డ్రాప్‌ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మాళవిక శర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల సుధీర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన మురుగ‌న్ పాట సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

అయితే.. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డింది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ముందుగా మే 31న విడుద‌ల చేయాల‌ని భావించారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల జూన్ 14కి వాయిదా ప‌డిన‌ట్లు ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ పోస్ట‌ర్‌లో సుదీర్ బాబు చేతిలో గ‌న్ ప‌ట్టుకుని న‌డుస్తుండ‌గా.. వెనుక మంట‌లు క‌నిపిస్తున్నాయి.

Manchu Vishnu : మంచు విష్ణు షాకింగ్ ట్వీట్‌.. క‌న్న‌ప్ప టీజ‌ర్‌ను మ‌న‌కిప్పుడే చూపించ‌రంట‌..

ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ విడుద‌ల కానుంది.

ట్రెండింగ్ వార్తలు