ఏపీలో సిట్ వేస్ట్.. జగన్, చంద్రబాబుకు బాధ్యత లేదా? : సీపీఐ నారాయణ

రాష్ట్రంలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సింది పోయి విదేశాలకు పోవడం ఎంతవరకు సరైందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Narayana : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో, పోలింగ్ తరువాత ఘర్షణలపై విచారణకు వేసిన సిట్ వేస్ట్, అదొక బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలనే ఏపీలో దాడులు జరిగాయి. ఏపీలోని స్ట్రాంగ్ రూంలోని ఈవీఎంల వద్ద భద్రత లేదు. ఎక్కడా సీసీ కెమెరాలు లేవని నారాయణ ఆరోపించారు. దాడుల్లో నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లను సస్పెండ్ చేశారు.. కానీ, కింద స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉన్న పోలీసులే ఇంకా ఉన్నారని నారాయణ అన్నారు.

Also Read : తెలంగాణలో కేసీఆర్‌కు జరిగినట్లే ఏపీలో జగన్‌కు జరుగుతుంది- ఏపీ ఎన్నికల ఫలితాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటే ఆపధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లారు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అమెరికా పోయారు. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే ఇద్దరు విదేశాలకు వెళ్లడం బాధ్యతారహితం కాదా అని నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సింది పోయి విదేశాలకు పోవడం ఎంతవరకు సరైందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అల్లర్లపై సిట్ కాదు.. జ్యూడీషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Also Read : Fish Prasadam : బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం.. పంపిణీ తేదీ ఎప్పుడు.. ఎక్కడంటే?

బెంగళూరులో రేవ్ పార్టీపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అసలు ఆ రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎలా వచ్చాయో కనుక్కోండి. కానీ, ఎందుకు ఆ పార్టీకి సంబంధం లేనివాళ్లను బజారుకు ఈడుస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. ఇది సరైంది కాదని పేర్కొన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు