తెలంగాణలో కేసీఆర్‌కు జరిగినట్లే ఏపీలో జగన్‌కు జరుగుతుంది- ఏపీ ఎన్నికల ఫలితాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలివాలని అన్నారు. జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.

తెలంగాణలో కేసీఆర్‌కు జరిగినట్లే ఏపీలో జగన్‌కు జరుగుతుంది- ఏపీ ఎన్నికల ఫలితాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy : ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణకు చెందిన పలు పార్టీల నాయకులు తమ స్పందన తెలుపుతున్నారు. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జగనే విజయం సాధిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఏపీ ఎన్నికల రిజల్ట్స్ పై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలివాలని అన్నారు. ఇక్కడ కేసీఆర్ ను ఓడించినట్లే.. జగ‌న్ అహంకారమే ఆయనను ఓడిస్తుందన్నారు కిషన్ రెడ్డి. జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.

”గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక రావటం బీజేపీకి కలిసి వచ్చింది. మా కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనుకునే వారు. ప్రస్తుతం అతనిని బ్లాక్ మెయిలర్ అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్స్ ఆయనకు సహకరించటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ. బీఆర్ఎస్ ప్రభావం లేదు” అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : పోలింగ్ శాతం పెరగడానికి కారణమిదే, విదేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం- మంత్రి పెద్దిరెడ్డి