రేవ్ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలవారే.. ఒక నటి కూడా ఉన్నారు : బెంగళూరు సిటీ సీపీ బి. దయానంద్

పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాం. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందని బెంగళూరు సిటీ సీపీ బి. దయానంద్ తెలిపారు.

Bengaluru Rave Party Case : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి వివరాలను బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి. దయానంద్ వివరించారు. సన్ సెట్ టు సన్రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించగా.. ఇందులో 101 మంది పాల్గొన్నారని చెప్పారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారు. పార్టీలో డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. రేవ్ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారు. పార్టీలో ఒక నటికూడా ఉన్నారు. వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని సీపీ దయానంద్ అన్నారు.

Also Read : Artist Hema : రేవ్ పార్టీపై 10టీవీతో స్పందించిన నటి హేమ.. ఏమందంటే..

పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాం. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది. రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో డ్రగ్స్ ను నాశనం చేసే ప్రయత్నం చేశారు. స్విమ్మింగ్ పూల్స్, ప్రహరీ గోడ బయట పడేశారు. డ్రగ్స్ ను డాగ్ స్వ్కాడ్ ద్వారా గుర్తించామని సీపీ దయానంద్ చెప్పారు. ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేశాం. రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు.

Also Read : Anand Deverakonda : టాలీవుడ్‌లో ఎవరైనా ఏదైనా సాధిస్తే కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి.. ఆనంద్ సంచలన వ్యాఖ్యలు..

బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పలువురు టీవీ నటులు, సినీ నటులు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి రాగా.. వారు మీడియా ముందుకొచ్చి ఆ వార్తలను ఖండించారు. తాజాగా బెంగళూరు సిటీ పోలీస్ కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం రేవ్ పార్టీలో ఒక నటి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నటి ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ రేవ్ పార్టీని “Sun set to sun raise victory” పేరుతో నిర్వహించారు. పార్టీ నిర్వహించిన వ్యక్తి హైదరాబాద్ బిజినెస్ మెన్ వాసు. అతని బర్త్ డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీకి సుమారు 150మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీ లో పలువురు డ్రగ్స్ వినియోగించారు.

 

ఆదివారం సాయంత్రం నుండి గోపాల్ రెడ్డి ఫార్మ్ హౌస్ లో నాన్ స్టాప్ గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్ , డిజేలు పెట్టడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం వేకువ జామున 3గంటల సమయంలో రైడ్ చేశారు. ఈ పార్టీ నిర్వాహకుడు వాసుతోపాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వాసు, అరుణ్, సిద్ధికి, రణ్ దీర్, రాజ్ లు ఉన్నట్లు తెలిసింది. వాసు, అరుణ్ బంధువులు. ఈవెంట్ మొత్తానికి ఇన్ చార్జిగా అరుణ్ వ్యవహరించాడు. వాసు బర్త్‌డే పార్టీకి డ్రగ్స్‌ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్‌, రాజ్‌ కూడా రావడంతో డ్రగ్స్‌ వాడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. రేవ్‌ పార్టీ ఇచ్చిన వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

ట్రెండింగ్ వార్తలు