Artist Hema : రేవ్ పార్టీపై 10టీవీతో స్పందించిన నటి హేమ.. ఏమందంటే..

తాజాగా నటి హేమ ఈ రేవ్ పార్టీ వివాదంపై 10టీవీతో మాట్లాడింది.

Artist Hema : రేవ్ పార్టీపై 10టీవీతో స్పందించిన నటి హేమ.. ఏమందంటే..

Artist Hema Reacts on Rave Party Issue with 10tv

Updated On : May 21, 2024 / 12:04 PM IST

Artist Hema – Rave Party : బెంగుళూరులో ఓ రేవ్ పార్టీ జరిగినట్టు, అందులో పలువురు టాలీవుడ్ నటీనటులు ఉన్నట్టు నిన్నటినుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కన్నడ పోలీసులు బెంగుళూరులోని ఆ రేవ్ పార్టీని భగ్నం చేసి అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు కూడా రావడంతో హేమ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అని నిన్న ఓ వీడియో రిలీజ్ చేసింది.

అయితే పోలీసులు విడుదల చేసిన ఫొటోలు, వీడియోలలో హేమ ఫోటో కూడా ఉంది. హేమ తాను హైదరాబాద్ లో ఉన్నట్టు వీడియో రిలీజ్ చేసి అందరిని తప్పుదోవ పట్టించిందని మరో కేస్ కూడా పెట్టినట్లు సమాచారం. తాజాగా నటి హేమ ఈ రేవ్ పార్టీ వివాదంపై 10టీవీతో మాట్లాడింది.

Also Read : Bangalore Rave Party: వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

హేమ మాట్లాడుతూ.. నేను రెండు రోజుల నుండి హైదరాబాదులోనే ఉన్నాను. నిన్న నేను చేసిన వీడియో కూడా హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నుంచే చేశాను. నాకు వాసు ఎవరో తెలియదు. అసలు కన్నడతో నాకేం సంబంధం. ఆ పార్టీ తో నాకెలాంటి సంబంధం లేదు. నేను హైదరాబాద్ లో నా ఇంట్లోనే ఉన్నాను అని తెలిపింది. ఇది ఇలా ఉండగా బెంగుళూరు పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్న వారందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వదిలేసినట్లు పేర్కొన్నారు. కన్నడ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలు, వీడియోల్లో హేమ కూడా ఉంది.