Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఈటల, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్. ఇదిలా ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేమిటంటే..

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్. ఇదిలా ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ లతో మంత్రి కేటీఆర్ సామరస్యంగా మాట్లాడారు. ఎప్పుడు టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉప్పు నిప్పుల్లా మండిపడే నేతలు అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం సామరస్యంగా మాట్లాడుకున్నారు. ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ లతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మరి ముఖ్యంగా టీఆర్ఎస్ కు గుడ్ చెప్పి బీజేపీలో చేరి హుజూరాబాద్ నుంచి మరోసారి బీజేపీగా ఎన్నిక అయిన ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడారు కేటీఆర్.

హుజూరాబాద్ అధికార కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేదు? అంటూ ఈటలన ప్రశ్నించారు కేటీఆర్. దానికి ఈటల పిలిస్తేనే కదా హాజరయ్యేది అంటూ సమాధానమిచ్చారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదంటూ పనిలో పనిగా ఈటల ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే అని కూడా చూడలేదని కనీసం కలెక్టర్ కూడా ఆహ్వానించలేదని అన్నారు. ఈటల, కేటీఆర్ ఇలా సంభాషించుకుంటుండగా మధ్యలో ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ఈటలనే కాదు అధికారిక కార్యక్రమాలకు నన్ను కూడా పిలవటంలేదన్నారు భట్టి. ఇలా ఎప్పుడు విమర్శలు ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుకునే నేతలు సమోధ్యగా మాట్లాడుకోవటానికి అసెంబ్లీ కార్యక్రమాలు వేదిక అయ్యాయి.

కాగా ఈ అసెంబ్లీ సమావేశాలు మరో పాజిటివ్ వేవ్ కు వేదిక అయ్యాయి. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య సమోధ్య కుదర్చాయి. ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య సమోధ్య కుదిరినట్లే కనిపిస్తోంది. గతంలో అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభమయింది.

తెలంగాణ ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని..తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంలా మారిందని అన్నారు. ఇలా పాజిటివ్ సన్నివేశాలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే మరి రాజకీయం అంటే. అని పెద్దలు ఊరికే అనలేదు.

 

 

ట్రెండింగ్ వార్తలు