CM of Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనేనా? ఇంతకీ కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోలో ఏముంది?

విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్‭లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వీట్ తినిపించారు

Congress Party: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం.. ముఖ్యమంత్రి ఎవరనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీలో సీనియర్ నేత అయిన సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని కొందరు అంటుండగా.. పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్న అధ్యక్షుడు డీకే శివకుమారే ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. ఈ అంచనాలు పక్కన పెడితే ఇద్దరి మద్దదారుల మధ్య ఇప్పటికే వార్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.

Sanjay Raut : ఇక మోదీ హవా ముగిసింది.. ఇప్పుడు విపక్షాల వేవ్ వస్తోంది : ఎంపీ సంజయ్ రౌత్

కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్‌ను వేశారు. ఇక డీకే శివకుమార్‌కు మద్దతుదారులు సైతం బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల రాష్ట్ర తదుపరి ‘ముఖ్యమంత్రి’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్‌ వేశారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించింది డీకే శివకుమారేనని ఆ పోస్టర్‭లో రాసుకొచ్చారు.

DK vs Siddaramaiah: ఫలితాలు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోస్టర్ వార్

అయితే.. ముఖ్యమంత్రి ఎవరో వాస్తవానికి నిన్ననే తేలిపోయిందని కొందరు నెటిజెన్లు అంటున్నారు. విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్‭లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వీట్ తినిపించారు. అయితే సిద్ధరామయ్యకు తినిపించే క్రమంలో కాస్త ఆటపట్టిస్తూ తినిపించారు. అదే డీకేకు తినిపించే సమయంలో అలాంటిది కనిపించలేదు.


దీంతో ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పిందని, సిద్ధరామయ్యే కాబోయే ముఖ్యమంత్రి అంటూ నెటిజెన్లు అంటున్నారు. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందో చూడాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో మెజారిటీ సాధించింది. బీజేపీ కేవలం 66 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక రాష్ట్ర పార్టీ అయిన జేడీఎస్ 19 సీట్లు మాత్రమే సాధించింది. ఇతరులకు నాలుగు స్థానాలు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు