నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్- కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో.. అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.

KTR Slams Congress : కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది అంటూ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటివరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారాయన.

”పౌర, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణిచివేస్తూ 49 సంవత్సరాల క్రితం ఇదేరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఇన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్ లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకొని ప్రదర్శన చేస్తారు. మరోవైపు అదే పార్లమెంట్ కు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ల పార్టీ ఆఫీస్ లో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో.. అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్” అని ట్వీట్ చేశారు కేటీఆర్.

Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

 

ట్రెండింగ్ వార్తలు