Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోమవారం తాను కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే.. కరోనా పాజిటివ్‌గా కన్ఫమ్ కావడంతో కుటుంబ సభ్యులంతా కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఈమధ్య కాలంలో నన్ను కలిసిన వారు కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అంటూ తారక్ ట్వీట్ చేశారు.
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
— Jr NTR (@tarak9999) May 10, 2021
ఎన్టీఆర్ తనకు కోవిడ్ సోకిందని చెప్పినప్పటి నుండి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.. ఎందుకంటే ఈ నెల 20వ తేది జూనియర్ పుట్టినరోజు.. ప్రస్తుతం యాక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ క్యారెక్టర్‌కి సంబధించి మూవీ టీం ఓ అప్డేట్ ఇవ్వనున్నారు అని తెలిసి ఫ్యాన్స్ సంబరాలు జరపాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఇంతలో ఈ వార్త వినాల్సి రావడంతో తీవ్రనిరాశకు లోనయ్యారు.
నందమూరి చిన్న రామారావు ( @tarak9999 ) బాబు గారికి కరోన నుంచి తొందరగా కోలుకోవాలని కడప “శంకర్” (@SankarKadapa )అన్న వారి కుటుంబంతో కలిసి “సాయిబాబా” మందిరం లో ప్రత్యేక పూజలు చేసినారు.. బాబు గారు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రేమతో మీ
కడప NTR fans … pic.twitter.com/DOtAZX4uez— Kadapa NTR FANS (@fans_kadapa) May 11, 2021
గతేడాది కూడా ఈ మహమ్మారి కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ లో తారక్ కొమరం భీం వీడియో రిలీజ్ చెయ్యలేకపోయారు.. ఇక తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ.. జూనియర్ అభిమానులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. అభిమానులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పలు దేవాలయాల్లో తారక్ కోలుకోవాలంటూ ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారు. ఇక సినీ వర్గాల వారు తారక్ త్వరగా రికవరీ కావాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Fanism has no Religion❤?
NTR Fans offering their prayers, for @tarak9999‘s quick Recovery!
Jai NTR ✊ #GetWellSoonNTR ? pic.twitter.com/h5YPrp8is4
— NTR Fans (@NTR2NTRFans) May 11, 2021