Ippa Puvvu Collection : ఇప్పపువ్వు సేకరణలో గిరిజనులు

ప్రస్తుతం సీజన్ కావడంతో ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. అయితే మార్కెట్ లో గిట్టుబాటు ధర రావడంలేదంటున్నారు గిరిపుత్రులు.

Ippa Puvvu Collection : అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన విప్పపువ్వు.. గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. గిరిజన ప్రాంతంలో  సహజసిద్ధంగా లభించే విప్ప పువ్వును అటవీ ప్రాంత ప్రజల బతుకుతెరువుగా భావిస్తారు. అలాంటి విప్పపువ్వు ప్రస్తుతం సీజన్ కావడంతో ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. అయితే మార్కెట్ లో గిట్టుబాటు ధర రావడంలేదంటున్నారు గిరిపుత్రులు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

కొండకోనల్లో జీవించే గిరిజనులకు ప్రకృతి వనరులే జీవనాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల పండ్లు, పంటలు గిరిజనులకు ఆహార సంపదతో పాటు ఆదాయ వనరులుగా ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం ఇప్పపువ్వు సీజన్ కావడంతో ఆదిలాబాద్ జిల్లాలో గిరిపుత్రులు పువ్వు సేకరణలో నిమగ్నమయ్యారు.

ఎండ తీవ్రత ఉండటంతో, తెల్లవారుజామునే దగ్గరలోని అడవికి వెళ్లి, ఇప్పపూలను సేకరిస్తారు. ఎండ తీవ్రమయ్యే సమయానికి ఇండ్లకు చేరుకుంటారు. ఇప్పపువ్వు సేకరణలో మహిళలు, పిల్లలే అధికంగా పాల్గొంటారు. తెచ్చిన పువ్వును ఎండపెట్టి వంటకాలు చేసుకొని తింటుంటారు. మిగితా పువ్వును మార్కెట్ లో అమ్ముకుంటారు. అయితే మార్కెట్ లో గిట్టుబాటు ధర రావడంలేదంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ట్రెండింగ్ వార్తలు