Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ప్రధానంగా తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ.. అందులో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని చింతపల్లిలో అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.

Agri Tips : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో విస్తారంగా రబీ కూరగాయలు సాగవుతున్నాయి. ఉన్న కొద్దిపాటిగా నీటి నిల్వలతో మాలి జాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారు. ప్రధానంగా తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ.. అందులో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని చింతపల్లిలో అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆది నుంచి సేంద్రీయ విధానంలోనే పంటలను సాగుచేస్తున్నారు గిరిజనులు. రాగులు, కొర్రలు, సామలు, చింతపండు, అరటి, సీతాఫలాలు, రామఫలాలు, పనస పళ్లు, కూరగాయలు ఇలా సహజ సిద్ధమైన పంటలు పండుతున్నాయి. వీటికి ఎటువంటి రసాయన ఎరువుల వాడకం ఉండదు. అటవీ ప్రాంతంలో, కొండ వాలులో సారవంతమైన మట్టి ఉండటం సహజ సిద్ధ పంటకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో కొట్టుకు వచ్చే సారవంతమైన మట్టి కావడంతో రసాయన ఎరువులు అవసరం లేదు. దీనికితోడు గిరిజనులు ఎక్కువగా పశువులను పెంచుతుంటారు. వాటి ఎరువును అధికంగా వినియోగిస్తుంటారు.

ఇవన్నీ సేంద్రీయ సాగు విధానంలో భాగమే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఇదే. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, చౌడుపల్లి గ్రామంలోని మాలిజాతి గిరిజనులు ప్రతి ఒక్కరు ఎంతో కొంత విస్తీర్ణంలో కూరగాయలను సాగుచేస్తున్నారు. ప్రధాన పంటలుగా మొక్కజొన్న పంటను ఎంచుకొని అందులో అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు.

ఇలా ఒక పంట పూర్తి కాగానే మరోపంట వచ్చే విధంగా ప్రాణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఈ పంటలను పండిస్తున్నారు. ఇంటి అనుండి వచ్చే వృధానీటిని సైత పంటపొలాలకు తరలిస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన కూరగాయలను చింతపల్లి ప్రాంతానికి తరలించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Read Also : Ippa Puvvu Collection : ఇప్పపువ్వు సేకరణలో గిరిజనులు

ట్రెండింగ్ వార్తలు