Arjun Tendulkar aggression sparks cheeky response from Stoinis during MI vs LSG Clash
Arjun Tendulkar – Marcus Stoinis : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఆడాడు. ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.
కాగా.. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ కోపంతో లక్నో స్టార్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ వైపు బాల్‌ను విసిరికొట్టబోయాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌లోని మొదటి బంతికి స్టోయినిస్ షాట్ ఆడగా బంతి బౌలర్ అర్జున్ దిశగానే వెళ్లింది. వెంటనే బంతిని అందుకున్న అర్జున్ చాలా ఆవేశంగా స్టోయినిస్ వైపు బాల్‌ను త్రో చేయబోయి నియంత్రించుకున్నాడు. అర్జున్ కోపంగా కనిపించడం చూసిన స్టోయినిస్ స్మైల్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
మళ్లీ 15వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చాడు అర్జున్. తొలి రెండు బంతులను నికోలస్ పూరన్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. ఈ దశలో గాయంతో అర్జున్ మైదానాన్ని వీడాడు. ఈ ఓవర్‌లో మిగిలిన బంతులను నమన్ ధిర్ వేశాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 29 పరుగులు వచ్చాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (29 బంతుల్లో 75), కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 55) అర్థశతకాలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(38 బంతుల్లో 68), నమన్ ధిర్ (28 బంతుల్లో 62 నాటౌట) లు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.
Arjun Tendulkar shows aggression to Marcus Stoinis.??#mivslsg #mivlsg #lsgvsmi #lsgvmi #tataipl #tataipl2024 #ipl2024 #ipl #mumbaiindians #crickettwitter pic.twitter.com/SCzAdnkzmx
— AK tweets (@ajithkumaarrrrr) May 17, 2024