T20 World Cup 2026 : ఒకే ఒక క్యాచ్.. టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. కెప్టెనే కొంప ముంచాడు గదయ్యా..
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) నుంచి ఇంగ్లాండ్ జట్టు నిష్ర్కమించింది.
England Skipper Harry Brook drop Sanju Samson catch In Semifinal england out of T20 World Cup 2026
- సెమీస్‌లో సంజూ శాంసన్ క్యాచ్‌ను మిస్ చేసిన హ్యారీ బ్రూక్
- భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లాండ్
- టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఇంగ్లాండ్ జట్టు నిష్ర్కమించింది. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సెమీస్‌లో చేసిన ఓ చిన్న తప్పిదం కారణంగా టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ జట్టు కథ ముగిసింది. మరి బ్రూక్ చేసిన ఆ తప్పు ఏంటి? ఎందుకు ఇంగ్లాండ్ ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించిందో చూద్దాం..
క్రికెట్లో ఓ ప్రసిద్ధ నానుడి ఉంది అదే..క్యాచెస్ విన్ మ్యాచెస్. అంటే.. క్యాచ్‌లు అందుకుంటేనే మ్యాచ్‌లు గెలవగలం అని దీని అర్థం. ఒక్క క్యాచ్ మిస్ చేసినా సరే మ్యాచ్ ఫలితం మరిపోతుంటుంది. ఇలా ఒక్క క్యాచ్ మిస్ చేయడంతో గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడిపోయిన జట్లు ఎన్నో.
తాజాగా హ్యారీ బ్రూక్ కూడా సెమీస్ మ్యాచ్‌లో సింపుల్ క్యాచ్‌ను మిస్ చేశాడు. ఫలితం ఆ జట్టు మ్యాచ్ ఓడిపోవడమే కాదు.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
అసలేం జరిగిందంటే..?
టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. రెండు ఓవర్లు పూర్తి అయ్యే సరికి అభిషేక్ శర్మ (9) ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. ఈ ఓవర్లో మొదటి బంతిని శాంసన్ ఫోర్ కొట్టాడు. అదే ఊపులో రెండో బంతిని సైతం మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మిస్ చేశాడు. అప్పుటికి శాంసన్ స్కోరు 15 పరుగులు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శాంసన్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. అతడితోపాటు శివమ్ దూబె (25 బంతుల్లో 43 పరుగులు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39 పరుగులు) దంచికొట్టడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. అనంతరం జాకెబ్ బెథెల్ (105 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేయడంతో 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులకు పరిమితమైంది. 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.
శాంసన్ క్యాచ్ పట్టి ఉంటే..
హ్యారీ బ్రూక్ గనుక శాంసన్ క్యాచ్ పట్టి ఉంటే వెంట వెంటనే రెండు వికెట్లు పడడంతో భారత్ ఒత్తిడిలో పడేది. 250 పై చిలుకు పరుగులు చేసి ఉండకపోయి ఉండేది. అప్పుడు ఇంగ్లాండ్ ఈజీగా మ్యాచ్ గెలిచేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. తన తప్పిదం కారణంగానే మ్యాచ్ ఓడిపోయినట్లు అంగీకరించాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
Ohhhhh, Harry Brook! 😳
Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀
ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv
— Star Sports (@StarSportsIndia) March 5, 2026
