Jacob Bethell : వార్నీ నువ్వు ఐపీఎల్లో కూడా ఉన్నావా? భారత్‌ను బెంబేలెత్తించిన జాకబ్ బెథెల్ ఏ టీమ్ అంటే?
భారత్‌తో జరిగిన సెమీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకెబ్ బెథెల్ (Jacob Bethell ) సెంచరీతో చెలరేగాడు.
Do you know Which team will Jacob Bethell play for in IPL 2026
- సెమీస్‌లో జాకెబ్ బెథెల్ విధ్వంసకర సెంచరీ
- అయినా ఓడిన ఇంగ్లాండ్
- ఆనందంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
Jacob Bethell : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీస్‌లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 253 పరుగులు చేసినప్పటికి కూడా కేవలం 7 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకెబ్ బెథెల్ భారత బౌలర్లను ముచ్చెమటలు పట్టించాడు.
254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో జాకెబ్ బెథెల్ క్రీజులో అడుగుపెట్టాడు. తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టాడు. యడా పెడా సిక్సర్లు ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 19 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.
ఆ తరువాత కూడా జోరును కొనసాగించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి ఆఖరి ఓవర్ తొలి బంతికి రనౌట్ అయ్యాడు. అతడు ఉన్నంత సేపు భారత గెలుపు పై ధీమా లేదు. అంతలా భారత్‌ను వణికించాడు.
ఐపీఎల్లో ఏ జట్టు అంటే..?
ఐపీఎల్లో కూడా జాకెబ్ బెథెల్ ఆడుతున్నాడు. అతడు ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2025లో కూడా అతడు ఆర్సీబీ తరుపున ఆడాడు. అయితే.. ఆ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు ముందు అతడు అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా జట్టును వీడాడు. అతడి స్థానంలో మిగిలిన సీజన్ కోసం టిమ్ సీఫెర్ట్ 2 కోట్లకు ఆర్సీబీ తీసుకుంది.
ఇక ఐపీఎల్ మెగావేలం 2026కి ముందు ఆర్సీబీ జాకబ్ బెథెల్‌ను 2.60 కోట్లకు నిలుపుకుంది. వాంఖడేలో జాకెబ్ విధ్వంసం చూశాక.. ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్లో అతడు ఇంకెన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడో చూడాలి.
